నెల్లూరు బారాషాహీద్ దర్గా రొట్టెల పండుగకు వచ్చే భక్తులు, పర్యాటకుల కోసం స్వర్ణాల చెరువులో ఏర్పాటు చేసిన బోట్ షికారు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
నెల్లూరు బారాషాహీద్ దర్గా రొట్టెల పండుగకు దేశవ్యాప్తంగా కులమతాలకతీతంగా లక్షలాదిగా తరలివస్తున్న భక్తజనం ఓవైపు. ప్రతి సంవత్సరం జరుగుతున్న రొట్టెల పండుగను ఆస్వాదించడానికి విచ్చేసే వేలాదిమంది పర్యాటకులు మరొక వైపు. స్వర్ణాల ఘాట్ చుట్టూ ఉండే పచ్చదనాన్ని ఆస్వాదిస్తూ స్వర్ణాల చెరువులో పర్యాటకుల కోసం ఏర్పాటు చేసిన బోట్ షికార్ లక్షలాదిగా వచ్చిన పర్యాటకులకు మరింత ఆహ్లాదాన్ని, ఆనందాన్ని కలిగిస్తోంది.అసలే వేసవికాలం కావడంతో కుటుంబాలకు కుటుంబాలు బారా షాహిద్ దర్గా రొట్టెల పండుగకు దేశవ్యాప్తంగా తరలివచ్చిన భక్తులకు బోట్ షికారు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది… చిన్న పెద్ద తేడా లేకుండా ప్రతి ఒక్కరూ స్వర్ణల చెరువులో ఏర్పాటు చేసిన బోట్ షికార్ లో విహరిస్తూ ఎంజాయ్ చేస్తున్నారు. ఈ రొట్టెల పండుగ తమకు ప్రత్యేకమైన అనుభూతిని మిగిల్చిందంటూ భక్తులు పర్యాటకులు చెబుతున్నారు. స్వర్ణాల చెరువులో బోట్ షికారు. రొట్టెల పండుగకు మరో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది.


