శ్రీ కాళహస్తి, ఆగస్టు 13, (పున్నమి న్యూస్): శ్రీకాళహస్తి రూట్ డిపో పరిధిలో నడుస్తున్న ఆర్టీసీ బస్సు వేళల వల్ల విద్యార్థులు, ఉద్యోగులు, రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని కాళంగి వయా దండుబాట, పోతుగుంట మార్గంలోని సుమారు 20 గ్రామాల ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. శ్రీకాళహస్తి నుండి కాళంగి మార్గంలో నడుస్తున్న ‘AP 39 Z 0058’ నెంబరు గల బస్సు ప్రస్తుతం ప్రయాణికులకు అనుకూలంగా లేని వేళల్లో నడుస్తోందని వారు పేర్కొంటున్నారు. ముఖ్యంగా సాయంత్రం 4:45 గంటలకే శ్రీకాళహస్తి నుండి ఈ బస్సు సర్వీసు ముగిసిపోతుండటంతో, ఆ తర్వాత పనుల నిమిత్తం పట్టణానికి వచ్చే విద్యార్థులు, వివిధ కార్యాలయాల్లో పనిచేసే కార్మికులు, కూరగాయలు అమ్ముకునే రైతులు తిరిగి తమ గ్రామాలకు చేరుకోవడానికి తీవ్ర అవస్థలు పడాల్సి వస్తోంది. ఈ మార్గంలో సరైన రవాణా సౌకర్యం లేకపోవడాన్ని ఆసరాగా చేసుకుని కొందరు ఆటో డ్రైవర్లు మద్యం సేవించి వాహనాలు నడుపుతున్నారని, దీనివల్ల ప్రయాణికులు ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకుని భయాందోళనల మధ్య ప్రయాణించాల్సి వస్తోందని లేఖలో ఆందోళన వ్యక్తం చేశారు. కావున, ఆర్టీసీ డిపో అధికారులు స్పందించి ప్రయాణికుల క్షేమాన్ని, అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఈ బస్సును సాయంత్రం 7:00 గంటలకు శ్రీకాళహస్తి నుండి కాళంగికి నడిపించేలా వేళలను మార్చాలని సదరు 20 గ్రామాల ప్రజలు అధికారులను డిమాండ్ చేస్తున్నారు.

శ్రీకాళహస్తి–కాళంగి బస్సు వేళలు మార్చాలి-20 గ్రామాల ప్రజల విజ్ఞప్తి