Thursday, 9 July 2026
  • Home  
  • సామాజిక న్యా యానికి ఫూలే‌విగ్రహం స్ఫూర్తి
- శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

సామాజిక న్యా యానికి ఫూలే‌విగ్రహం స్ఫూర్తి

పట్నం రవీంద్ర బాబు చారిటబుల్ ట్రస్ట్ రవీంద్ర…. సామాజిక న్యాయం చేకూర్చడంలో జ్యోతిరావు పూలే విగ్రహం స్ఫూర్తిదాయకంగా నిలుస్తుంది అని పట్నం రవీంద్ర బాబు చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకులు పట్నం రవీంద్ర బాబు పేర్కొన్నారు. కలిగిరి తహాశీల్దార్ ఆఫీస్ కార్యాలయం సెంటర్ లో ఏర్పాటు చేస్తున్న మహాత్మ పూలే విగ్రహం కు ట్రస్ట్ తరఫున 50 వేల రూపాయలు విరాళాలు అందించారు. ఈ సందర్భంగా రవీంద్ర బాబు మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల అభివృద్ధికి విద్యాపరంగా ఎన్నో పోరాటాలు చేసిన పూలే ఆశయాలు నేడు ఫలిస్తున్నాయ ని పేర్కొన్నారు నాడు ఆయన చేసిన పోరాటం తో నేడు ఎంతోమంది బడుగు బలహీన వర్గాల వారు విద్యలో విజయాలు సాధించి సమాజంలో అన్ని రంగాలలో తమ ప్రతిభను చాటుకుంటున్నారని బాబు తెలిపారు విద్య ద్వారానే విజయం లభిస్తుంది అన్న పూలే లక్ష్యం ప్రతి ఒక్కరికి స్ఫూర్తి కావాలని ఆశయంతో తన సొంత మండలం అయిన కలిగిరిలో ఏర్పాటు చేస్తున్న పూలే విగ్రహానికి ఉడత భక్తిగా తన వంతు సాయం చేస్తున్నట్లు తెలిపారు. ఇంతటి అవకాశాన్ని తనకు లభించడం పట్ల ఎంతో ఆనందాన్ని వ్యక్తం చేస్తూ ఈ మేరకు 50 వేల రూపాయల నగదును తెలుగుదేశం పార్టీ ఎస్సీ సెల్ అధ్యక్షులు స్వర్ణ కొండయ్య ఎమ్మార్పీఎస్ లీడర్ వెంగళరావు ఆధ్వర్యంలో విగ్రహ కమిటీకి అందజేశారు యువకుడైన పట్నం రవీంద్ర స్వచ్ఛందంగా విగ్రహ ఏర్పాటు అభినందనీయమని ఆయన ఆశయాలను ఒకరికి చెప్పడమే కాక ఆచరణలో పాటిస్తుండడం ఎంతో ఆనందంగా ఉందని కమిటీ ప్రతినిధులు రవీంద్రను అభినందించారు. కార్యక్రమం లో ట్రస్ట్ ప్రతినిధులు ఉదయ్, క్రిష్ణా రెడ్డి పాల్గొన్నారు

పట్నం రవీంద్ర బాబు చారిటబుల్ ట్రస్ట్ రవీంద్ర….
సామాజిక న్యాయం చేకూర్చడంలో జ్యోతిరావు పూలే విగ్రహం స్ఫూర్తిదాయకంగా నిలుస్తుంది అని పట్నం రవీంద్ర బాబు చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకులు పట్నం రవీంద్ర బాబు పేర్కొన్నారు. కలిగిరి తహాశీల్దార్ ఆఫీస్ కార్యాలయం సెంటర్ లో ఏర్పాటు చేస్తున్న మహాత్మ పూలే విగ్రహం కు ట్రస్ట్ తరఫున 50 వేల రూపాయలు విరాళాలు అందించారు. ఈ సందర్భంగా రవీంద్ర బాబు మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల అభివృద్ధికి విద్యాపరంగా ఎన్నో పోరాటాలు చేసిన పూలే ఆశయాలు నేడు ఫలిస్తున్నాయ ని పేర్కొన్నారు నాడు ఆయన చేసిన పోరాటం తో నేడు ఎంతోమంది బడుగు బలహీన వర్గాల వారు విద్యలో విజయాలు సాధించి సమాజంలో అన్ని రంగాలలో తమ ప్రతిభను చాటుకుంటున్నారని బాబు తెలిపారు విద్య ద్వారానే విజయం లభిస్తుంది అన్న పూలే లక్ష్యం ప్రతి ఒక్కరికి స్ఫూర్తి కావాలని ఆశయంతో తన సొంత మండలం అయిన కలిగిరిలో ఏర్పాటు చేస్తున్న పూలే విగ్రహానికి ఉడత భక్తిగా తన వంతు సాయం చేస్తున్నట్లు తెలిపారు. ఇంతటి అవకాశాన్ని తనకు లభించడం పట్ల ఎంతో ఆనందాన్ని వ్యక్తం చేస్తూ ఈ మేరకు 50 వేల రూపాయల నగదును తెలుగుదేశం పార్టీ ఎస్సీ సెల్ అధ్యక్షులు స్వర్ణ కొండయ్య ఎమ్మార్పీఎస్ లీడర్ వెంగళరావు ఆధ్వర్యంలో విగ్రహ కమిటీకి అందజేశారు యువకుడైన పట్నం రవీంద్ర స్వచ్ఛందంగా విగ్రహ ఏర్పాటు అభినందనీయమని ఆయన ఆశయాలను ఒకరికి చెప్పడమే కాక ఆచరణలో పాటిస్తుండడం ఎంతో ఆనందంగా ఉందని కమిటీ ప్రతినిధులు రవీంద్రను అభినందించారు. కార్యక్రమం లో ట్రస్ట్ ప్రతినిధులు ఉదయ్, క్రిష్ణా రెడ్డి పాల్గొన్నారు

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.