Thursday, 10 September 2026
  • Home  
  • సర్ కార్యక్రమాన్ని పరిశీలించిన మున్సిపల్ చైర్ పర్సన్ దావ స్వాతి
- మంచిర్యాల

సర్ కార్యక్రమాన్ని పరిశీలించిన మున్సిపల్ చైర్ పర్సన్ దావ స్వాతి

బెల్లంపల్లి మున్సిపాలిటీ పరిధిలోని 32,33 వార్డ్ లకు సంబంధించి జరుగుతున్న ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ కార్యక్రమాన్ని గురువారం మున్సిపల్ చైర్ పర్సన్ దావ స్వాతి రమేష్ బాబు క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా చైర్మన్ మాట్లాడుతూ నోటీసులు అందిన వారు సరైన ధ్రువపత్రాలు అధికారులకు అందించి తమ ఓటు హక్కు కాపాడుకోవాలని సూచించారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ ఓటు హక్కు కల్పించడమే లక్ష్యంగా ఈ కార్యక్రమం జరుగుతోందని తెలిపారు. 18 సంవత్సరాలు నిండిన యువతీ యువకులు తప్పనిసరిగా కొత్తగా ఓటు హక్కు కోసం దరఖాస్తు చేసుకోవాలని, అలాగే ఓటర్ల జాబితాలో ఏవైనా తప్పులు ఉంటే సవరించుకోవాలని సూచించారు. . ఓటు హక్కు భవిష్యత్తును నిర్ణయించే ఆయుధమని పేర్కొన్నారు. కార్యక్రమంలో స్థానిక కౌన్సిలర్లు, మున్సిపల్ సిబ్బంది, బీఎల్ఓలు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.