Thursday, 3 September 2026
  • Home  
  • సనాతన ధర్మ పరిరక్షణకు కృషి చేస్తా: మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా కో-కన్వీనర్‌గా పడాల సౌజన్య లత నియామకం
- రంగారెడ్డి

సనాతన ధర్మ పరిరక్షణకు కృషి చేస్తా: మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా కో-కన్వీనర్‌గా పడాల సౌజన్య లత నియామకం

పున్నమి: రంగారెడ్డి జిల్లా: బ్రహ్మాండ్ సనాతన సంఘ్ మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా కో-కన్వీనర్‌గా పడాల సౌజన్య లత నియమితులయ్యారు. బుధవారం రోజున బ్రహ్మాండ్ సనాతన సంఘ్ కేంద్ర కార్యాలయంలో సంఘం అధ్యక్షులు శివ చేతుల మీదుగా పడాల సౌజన్య లత నియామక పత్రాన్ని స్వీకరించారు. ఈ సందర్భంగా పడాల సౌజన్య లత మాట్లాడుతూ, సనాతన ధర్మాన్ని, హిందూ మతాన్ని గౌరవిస్తూ వాటి అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని తెలిపారు. జిల్లా వ్యాప్తంగా గ్రామస్థాయి నుంచి భక్తి కార్యక్రమాలను నిర్వహించి, ప్రతి ఒక్కరికీ హిందూ మతం, సనాతన ధర్మం యొక్క ప్రాముఖ్యతను తెలియజేసే కార్యక్రమాలు చేపడతానన్నారు. అలాగే నోములు, వ్రతాలు, హోమాలు, యజ్ఞయాగాదులు వంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలను నిర్వహిస్తూ ప్రజలను భాగస్వాములను చేస్తామని పేర్కొన్నారు. బ్రహ్మాండ్ సనాతన సంఘ్ అధ్యక్షులు శివ మాట్లాడుతూ, ప్రతి ఒక్కరూ భక్తి శ్రద్ధలతో, ఐకమత్యంతో కలిసి జీవించాలని అన్నారు. హిందూ మతం, సనాతన ధర్మంలో జీవన క్రమశిక్షణతో పాటు గొప్ప సంస్కృతి, సంప్రదాయాలు ప్రతిబింబిస్తాయని తెలిపారు. కులమతాలకు, ప్రాంతాలకు అతీతంగా బ్రహ్మాండ్ సనాతన సంఘ్ ఆధ్వర్యంలో ఆధ్యాత్మిక, సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించాలని, ప్రతి ఒక్కరినీ కార్యక్రమాల్లో భాగస్వాములను చేయాలని ఆయన పిలుపునిచ్చారు. ముఖ్యంగా మహిళలు, పిల్లలు, యువత ముందుకు వచ్చి కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొనేలా ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని శివ అన్నారు.

పున్నమి: రంగారెడ్డి జిల్లా: బ్రహ్మాండ్ సనాతన సంఘ్ మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా కో-కన్వీనర్‌గా పడాల సౌజన్య లత నియమితులయ్యారు.

బుధవారం రోజున బ్రహ్మాండ్ సనాతన సంఘ్ కేంద్ర కార్యాలయంలో సంఘం అధ్యక్షులు శివ చేతుల మీదుగా పడాల సౌజన్య లత నియామక పత్రాన్ని స్వీకరించారు.

ఈ సందర్భంగా పడాల సౌజన్య లత మాట్లాడుతూ, సనాతన ధర్మాన్ని, హిందూ మతాన్ని గౌరవిస్తూ వాటి అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని తెలిపారు. జిల్లా వ్యాప్తంగా గ్రామస్థాయి నుంచి భక్తి కార్యక్రమాలను నిర్వహించి, ప్రతి ఒక్కరికీ హిందూ మతం, సనాతన ధర్మం యొక్క ప్రాముఖ్యతను తెలియజేసే కార్యక్రమాలు చేపడతానన్నారు.

అలాగే నోములు, వ్రతాలు, హోమాలు, యజ్ఞయాగాదులు వంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలను నిర్వహిస్తూ ప్రజలను భాగస్వాములను చేస్తామని పేర్కొన్నారు.

బ్రహ్మాండ్ సనాతన సంఘ్ అధ్యక్షులు శివ మాట్లాడుతూ, ప్రతి ఒక్కరూ భక్తి శ్రద్ధలతో, ఐకమత్యంతో కలిసి జీవించాలని అన్నారు. హిందూ మతం, సనాతన ధర్మంలో జీవన క్రమశిక్షణతో పాటు గొప్ప సంస్కృతి, సంప్రదాయాలు ప్రతిబింబిస్తాయని తెలిపారు.

కులమతాలకు, ప్రాంతాలకు అతీతంగా బ్రహ్మాండ్ సనాతన సంఘ్ ఆధ్వర్యంలో ఆధ్యాత్మిక, సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించాలని, ప్రతి ఒక్కరినీ కార్యక్రమాల్లో భాగస్వాములను చేయాలని ఆయన పిలుపునిచ్చారు. ముఖ్యంగా మహిళలు, పిల్లలు, యువత ముందుకు వచ్చి కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొనేలా ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని శివ అన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.