శ్రీ కాళహస్తి, జులై 25, (పున్నమి న్యూస్): శ్రీకాళహస్తిలోని శ్రీ ద్రౌపదీ సమేత ధర్మరాజు స్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా శనివారం నిర్వహించే అగ్నిగుండం వేడుకల నేపథ్యంలో పట్టణంలో ఉదయం 8 గంటల నుండి రాత్రి 10 గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలు అమలులో ఉంటాయని II-టౌన్ ఇన్స్పెక్టర్ కె. నాగరాజు తెలిపారు. ఈ సందర్భంగా వాహనదారులు, భక్తులు పోలీసులకు సహకరించాలని కోరారు. ఆంక్షల ప్రకారం.. శ్రీకాళహస్తి టౌన్ నుండి పిచ్చాటూరు, KVB పురం మరియు B.N. కండ్రిగ వెళ్లే వాహనాలు NTR సర్కిల్, హాస్పిటల్ రోడ్, SS కళ్యాణ మండపం, MGM సర్కిల్ మీదుగా ప్రయాణించాలి. పిచ్చాటూరు నుండి వచ్చే వాహనాలు చిలకవారి కండ్రిగ, MGM సర్కిల్ మీదుగా RTC బస్టాండ్‌కు చేరుకోవాలి. బైపాస్ వాహనాలు నంది సర్కిల్ నుండి తిరుపతి వైపు వెళ్లాలని, తిరుపతి, నెల్లూరు, నాయుడుపేట నుండి వచ్చే వాహనాలను AP సీడ్స్, ఓల్డ్ బైపాస్, నంది సర్కిల్, తెట్టు సర్కిల్ మీదుగా బస్టాండ్‌కు మళ్లిస్తున్నట్లు వెల్లడించారు. RTC బస్సులను గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ వరకు మాత్రమే అనుమతిస్తామని, శ్రీ ధర్మరాజు స్వామి వారి ఆలయం వైపునకు ఆటోలు, కార్లు, ట్రాక్టర్లు వంటి ఏ వాహనాలనూ అనుమతించేది లేదని ఆయన స్పష్టం చేశారు.

శ్రీకాళహస్తిలో నేడు ట్రాఫిక్ మళ్లింపులు-II-టౌన్ ఇన్స్పెక్టర్ నాగరాజు