Thursday, 10 September 2026
  • Home  
  • నాసా వేదికపై శ్రీచైతన్య విద్యార్థుల ప్రతిభకు అంతర్జాతీయ గుర్తింపు
- తిరుపతి

నాసా వేదికపై శ్రీచైతన్య విద్యార్థుల ప్రతిభకు అంతర్జాతీయ గుర్తింపు

శ్రీ కాళహస్తి, జులై 25, (పున్నమి న్యూస్): శ్రీకాళహస్తి పట్టణంలోని శ్రీరామ్‌నగర్ కాలనీలోని శ్రీచైతన్య పాఠశాల విద్యార్థులు ప్రతిష్ఠాత్మక నాసా స్పేస్ సెటిల్‌మెంట్ కాంటెస్ట్‌లో విశిష్ట ప్రతిభ కనబర్చి అంతర్జాతీయ స్థాయిలో అవార్డులు సాధించారు. పాఠశాలకు చెందిన ఏడుగురు విద్యార్థులు ఈ పోటీలో విజేతలుగా నిలవడం విశేషం. విజేతల్లో 8వ తరగతి విద్యార్థులు జాహ్నవి, విశ్వతేజ్, 7వ తరగతి విద్యార్థులు యశిత, ధ్రువ చాణక్య, ప్రతీక్ష, 9వ తరగతి విద్యార్థిని ఆశ్రిత తదితరులు ఉన్నారు. విజేతలను అభినందించేందుకు ఏర్పాటు చేసిన సన్మాన కార్యక్రమానికి రాష్ట్రపతి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత, కలతూరు ప్రభుత్వ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు కూనాటి సురేష్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులు పుస్తక జ్ఞానానికే పరిమితం కాకుండా భవిష్యత్తు ప్రపంచ అవసరాలకు అనుగుణంగా ఆవిష్కరణల దిశగా ఆలోచించడం అభినందనీయమని, అంతర్జాతీయ అవకాశాలను కల్పిస్తున్న శ్రీచైతన్య యాజమాన్యాన్ని ప్రశంసించారు. పాఠశాల ప్రిన్సిపల్ ఎ. రూపాదేవి మాట్లాడుతూ నాసా స్పేస్ సెటిల్‌మెంట్ కాంటెస్ట్ ప్రపంచవ్యాప్తంగా విద్యార్థుల్లో శాస్త్రీయ దృక్పథం, సృజనాత్మకత, పరిశోధనా నైపుణ్యాలను పెంపొందించే ప్రతిష్ఠాత్మక పోటీ అని తెలిపారు. భవిష్యత్తులో అంతరిక్షంలో మానవ నివాసాలు, ఆహారం, నీరు, విద్యుత్ వంటి మౌలిక అవసరాల కల్పనపై విద్యార్థులు వినూత్న ప్రాజెక్టులు రూపొందిస్తారని వివరించారు. ఏజీఎం సురేష్ మాట్లాడుతూ శ్రీచైతన్య విద్యార్థులు ప్రతి ఏడాది ఈ పోటీలో అత్యుత్తమ ప్రాజెక్టులతో జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ప్రశంసలు అందుకోవడం గర్వకారణమన్నారు. కార్యక్రమంలో కోఆర్డినేటర్లు బాలాజీ, శ్రీనివాస్, డీన్ త్రివేణి, ఇన్‌చార్జులు శ్రీహరి, వంశీ, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. అనంతరం విజేతలకు మెమెంటోలు, పతకాలు అందజేసి ఘనంగా సత్కరించారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.