కడప నగరం చలమారెడ్డిపల్లిలోని కైలాసపురంలో వెలసిన శ్రీ భువనేశ్వరి దేవీ మాత ఆలయ పునఃప్రారంభ మహోత్సవం ఈ నెల 21న ఘనంగా నిర్వహించనున్నట్లు జై మాతా భువనేశ్వరి కమిటీ తెలిపింది. కార్యక్రమానికి ఒంటిమిట్ట పోతన సాహిత్య పీఠం అధ్యక్షులు డాక్టర్ పసుపులేటి శంకర్ విశిష్ట అతిథిగా హాజరుకానున్నారు. ఆచలానంద ఆశ్రమ అధిపతి శ్రీ విరజానందస్వామి, మృత్యుంజయేశ్వర సర్వమంగళ పీఠం వ్యవస్థాపకులు రామకృష్ణ కవి పాల్గొంటారు. నూతన గోపుర శిఖర కలశ ప్రతిష్ఠాపనలో భాగంగా యాగశాల పూజలు, కుంభాభిషేకం, విశేష పూజలు, మంగళహారతి నిర్వహించి అనంతరం అన్నప్రసాద వితరణ చేపట్టనున్నారు.




