Wednesday, 30 September 2026
  • Home  
  • వ్యాపారి కర్రి వరప్రకాశరావుహత్య కేసును చేదించిన పోలీసులు
- అనకాపల్లి

వ్యాపారి కర్రి వరప్రకాశరావుహత్య కేసును చేదించిన పోలీసులు

పున్నమి ప్రతినిధి ఆనంద్ (జిల్లా బ్యూరో ) – ఒకరు అరెస్ట్ – ప్రధాన నిందితుడి కోసం గాలింపు.. యలమంచిలి టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓల్డ్ ఎస్బీఐ కాలనీకి చెందిన వ్యాపారి కర్రి వరప్రకాశరావు (49) హత్య కేసును పోలీసులు ఛేదించారు. మిస్సింగ్ కేసుగా నమోదైన ఈ వ్యవహారం పోలీస్ దర్యాప్తులో హత్య కేసుగా వెలుగుచూసింది. సోమవారం యలమంచిలి టౌన్ పోలీస్ స్టేషన్లో డి.ఎస్.పి బి.మోహన్ రావు, సిఐ ధనుంజయరావు, ఎస్ఐలు సావిత్రి, రామకృష్ణ ల సమక్షంలో మీడియా సమావేశం ఏర్పాటుచేసి ఆయన ఈ కేసు వివరాలు వెల్లడించారు. ఈ నెల 16న వ్యాపార పనుల నిమిత్తం రాజమండ్రి వెళ్లిన వరప్రకాశరావు తిరిగి ఇంటికి రాకపోవడంతో, ఆయన భార్య సత్య సెప్టెంబర్ 20న యలమంచిలి టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. మిస్సింగ్ కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టగా దిగ్భ్రాంతికర విషయాలు వెలుగులోకి వచ్చాయన్నారు. రాజమండ్రిలో జరిగిన నగదు మార్పిడి వ్యవహారం వ్యాపారంలో కర్రి వరప్రకాశరావు తో పాటు మరో ముగ్గురు వ్యక్తులు రూ. 10 లక్షలు పెట్టుబడి పెట్టినట్లు తెలిపారు. డబ్బులు తిరిగి రాకపోవడంతో అందులో 2.50 లక్షలు కర్రి వరప్రకాశరావును అడిగారు. అతడు డబ్బులు ఇవ్వకపోవడంతో ఈనెల 18న హత్య చేశారన్నారు. కోనసీమ జిల్లా అల్లవరం మండలం డి. తిప్ప గ్రామంలోని శ్మశానం వద్ద వరప్రకాశరావును హత్య చేసినట్లు దర్యాప్తులో తేలిందన్నారు. అనంతరం మృతదేహాన్ని రాజమండ్రి ధవళేశ్వరం బ్రిడ్జి మీది నుండి గోదావరి నదిలో పడేసినట్లు తెలిపారు. మృతదేహం కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. ఇప్పటికీ ఆచూకీ లభించలేదని, ఈనెల 27వ తేదీన అమలాపురంకు చెందిన ఏ1 అయిన కేదార్ శెట్టి విజయ గణేష్ ను అరెస్టు చేసి అదుపులోకి తీసుకుని కోర్టులో హాజరు పరచడమైనదని అన్నారు. ఈ ఘటనకు సంబంధించి యలమంచిలి ధనుంజయ్ రావు, పట్టణ ఎస్ఐ సావిత్రి కేసును త్వరగా చేదించారని తెలిపారు. ఈ కేసును అమలాపురానికి స్టేషన్ కు బదిలీ చేస్తున్నట్లు తెలిపారు.

పున్నమి ప్రతినిధి ఆనంద్ (జిల్లా బ్యూరో )

– ఒకరు అరెస్ట్ – ప్రధాన నిందితుడి కోసం గాలింపు..

యలమంచిలి టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓల్డ్ ఎస్బీఐ కాలనీకి చెందిన వ్యాపారి కర్రి వరప్రకాశరావు (49) హత్య కేసును పోలీసులు ఛేదించారు. మిస్సింగ్ కేసుగా నమోదైన ఈ వ్యవహారం పోలీస్ దర్యాప్తులో హత్య కేసుగా వెలుగుచూసింది. సోమవారం యలమంచిలి టౌన్ పోలీస్ స్టేషన్లో డి.ఎస్.పి బి.మోహన్ రావు, సిఐ ధనుంజయరావు, ఎస్ఐలు సావిత్రి, రామకృష్ణ ల సమక్షంలో మీడియా సమావేశం ఏర్పాటుచేసి ఆయన ఈ కేసు వివరాలు వెల్లడించారు. ఈ నెల 16న వ్యాపార పనుల నిమిత్తం రాజమండ్రి వెళ్లిన వరప్రకాశరావు తిరిగి ఇంటికి రాకపోవడంతో, ఆయన భార్య సత్య సెప్టెంబర్ 20న యలమంచిలి టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. మిస్సింగ్ కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టగా దిగ్భ్రాంతికర విషయాలు వెలుగులోకి వచ్చాయన్నారు. రాజమండ్రిలో జరిగిన నగదు మార్పిడి వ్యవహారం వ్యాపారంలో కర్రి వరప్రకాశరావు తో పాటు మరో ముగ్గురు వ్యక్తులు రూ. 10 లక్షలు పెట్టుబడి పెట్టినట్లు తెలిపారు. డబ్బులు తిరిగి రాకపోవడంతో అందులో 2.50 లక్షలు కర్రి వరప్రకాశరావును అడిగారు. అతడు డబ్బులు ఇవ్వకపోవడంతో ఈనెల 18న హత్య చేశారన్నారు. కోనసీమ జిల్లా అల్లవరం మండలం డి. తిప్ప గ్రామంలోని శ్మశానం వద్ద వరప్రకాశరావును హత్య చేసినట్లు దర్యాప్తులో తేలిందన్నారు. అనంతరం మృతదేహాన్ని రాజమండ్రి ధవళేశ్వరం బ్రిడ్జి మీది నుండి గోదావరి నదిలో పడేసినట్లు తెలిపారు. మృతదేహం కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. ఇప్పటికీ ఆచూకీ లభించలేదని, ఈనెల 27వ తేదీన అమలాపురంకు చెందిన ఏ1 అయిన కేదార్ శెట్టి విజయ గణేష్ ను అరెస్టు చేసి అదుపులోకి తీసుకుని కోర్టులో హాజరు పరచడమైనదని అన్నారు. ఈ ఘటనకు సంబంధించి యలమంచిలి ధనుంజయ్ రావు, పట్టణ ఎస్ఐ సావిత్రి కేసును త్వరగా చేదించారని తెలిపారు. ఈ కేసును అమలాపురానికి స్టేషన్ కు బదిలీ చేస్తున్నట్లు తెలిపారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.