ఖమ్మం ఆగష్టు 7
(పున్నమి న్యూస్ ఖమ్మం జిల్లా స్టాఫ్ రిపోర్టర్ )
ఖమ్మం జిల్లా బీజేపీ మహిళా మోర్చా అధ్యక్షురాలు మందా సరస్వతి ఆధ్వర్యంలో విశ్వకర్మ పథకం కింద రుణాలు మంజూరైన లబ్ధిదారులకు రూ.15 వేల విలువైన కిట్లు, వాషింగ్ మెషీన్లను పంపిణీ చేశారు. అర్హులైన వారికి రూ.1 లక్ష వరకు రుణాలు మంజూరయ్యాయని తెలిపారు. ఈ సందర్భంగా మందా సరస్వతి లబ్ధిదారులకు శుభాకాంక్షలు తెలియజేస్తూ, కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రజా సంక్షేమ పథకాలను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో లబ్ధిదారు నాగలక్ష్మితో పాటు స్వర్ణ, గీతా, రమేష్, సుజాత తదితరులు పాల్గొన్నారు.



