ఆత్మకూరు, ఆగస్టు 14 (పున్నమి ప్రతినిధి): 80వ స్వాతంత్ర్య దినోత్సవ సంబరాల్లో భాగంగా స్థానిక డా. ఎస్ఆర్జే డిగ్రీ కళాశాలలో రెండో రోజు మొక్కలు నాటే కార్యక్రమాన్ని ప్రిన్సిపాల్ ఇన్చార్జ్ సిరిమామిళ్ళ వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో నిర్వహించారు. కళాశాల ప్రాంగణంలో మొక్కలు నాటిన అనంతరం పర్యావరణ పరిరక్షణపై అవగాహన కల్పించారు.ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ ఇన్చార్జ్ సిరిమామిళ్ళ వెంకటేశ్వర్లు, డైరెక్టర్ మధుసూదన్ రెడ్డి మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ మొక్కలు నాటడాన్ని బాధ్యతగా గుర్తించాలని కోరారు. చెట్లు పెరగడం వల్ల వర్షపాతం పెరగడంతోపాటు ప్రాణవాయువు లభిస్తుందని, జీవరాశులకు ఆహారం, ఆవాసం లభిస్తాయని తెలిపారు.అనంతరం సిరిమామిళ్ళ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ విద్యార్థులు, యువతలో ఆత్మవిశ్వాసం, దేశభక్తి, క్రమశిక్షణ, సామాజిక బాధ్యత పెంపొందించి, మత్తు పదార్థాలకు దూరంగా ఉండేలా చైతన్యపరచడమే తన లక్ష్యమన్నారు. వికసిత భారత్–స్వర్ణాంధ్ర 2047 లక్ష్యాలకు అనుగుణంగా ప్రతి ఒక్కరూ తమ వంతు కృషి చేయాలని పిలుపునిచ్చారు. విద్యార్థులు కూడా దేశం కోసం తాము చేయబోయే కార్యక్రమాలను సెల్ఫీ వీడియోల ద్వారా తెలియజేయాలని సూచించారు.కార్యక్రమంలో లైబ్రేరియన్ టి. శ్రీనివాసులురెడ్డి, అధ్యాపకులు రమణయ్య, సుప్రియ, వెంకట్రావ్, శ్రీనివాసులు, రవీంద్ర తదితరులు పాల్గొన్నారు.

విద్యార్థుల్లో దేశభక్తి, సామాజిక బాధ్యత పెంపొందించాలి