Friday, 14 August 2026
  • Home  
  • రంగానాయకుల గుట్ట సమీపంలో యువకుడి దారుణ హత్య
- ఖమ్మం

రంగానాయకుల గుట్ట సమీపంలో యువకుడి దారుణ హత్య

ఖమ్మం నగరంలోని 3వ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. రంగానాయకుల గుట్ట సమీపంలో ఇద్దరు యువకుల మధ్య ఘర్షణ చోటుచేసుకోగా, దంటేటి శ్రీనాథ్‌పై కత్తితో దాడి చేసినట్లు సమాచారం. తీవ్ర గాయాలతో శ్రీనాథ్ కాలువలో విగతజీవిగా పడి ఉండటాన్ని గమనించిన స్థానికులు వెంటనే ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. హత్యకు గల కారణాలపై దర్యాప్తు చేపట్టారు. నిందితుడిగా భావిస్తున్న వేముల మధు పరారీలో ఉన్నట్లు సమాచారం. అతడి కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టినట్లు తెలిసింది. ఘటనతో స్థానికంగా తీవ్ర కలకలం నెలకొంది.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.