చెన్నారావుపేట, సెప్టెంబర్ 16: దుస్తులను సద్వినియోగం చేసుకోవాలని నాయక్ పోడు కాలనీ ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు బొమ్మెర సతీష్ అన్నారు. మండలంలోని నాయక్ పోడు కాలనీ ప్రాథమిక పాఠశాలలో బుధవారం విద్యార్థులకు ఏకరూప దుస్తుల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. విద్యార్థులు దుస్తులను సద్వినియోగం చేసుకొని క్రమశిక్షణను అలవర్చుకోవాలన్నారు. చదువుతోపాటు అన్ని రంగాలలో ముందంజలో ఉండాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు జాటోతు పద్మ, స్థానిక మహిళా సమాఖ్య సభ్యులు స్వరూప, శివ, పార్వతి, కల్పన, విద్యార్థులు, పాల్గొన్నారు

విద్యార్థులు దుస్తులను సద్వినియోగం చేసుకోవాలి