నీట్ పేపర్ లీకేజీకి నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రదాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ సీపీఐ ఎం.ఎల్ న్యూడెమోక్రసీ ఆధ్వర్యంలో ఆదిలాబాద్ జిల్లా దస్నాపూర్లో నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఢిల్లీలో శాంతియుతంగా ఆందోళన చేస్తున్న నిరుద్యోగ యువత, విద్యార్థులపై లాఠీచార్జీ, టియర్ గ్యాస్ ప్రయోగించడాన్ని నాయకులు తీవ్రంగా ఖండించారు. ఈ సందర్భంగా జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు బి. వెంకట నారాయణ మాట్లాడుతూ, నీట్ పేపర్ లీకేజీ ఘటనపై కేంద్ర ప్రభుత్వం బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. విద్యార్థులపై బలప్రయోగం ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమని అన్నారు. ఎన్టీఏను రద్దు చేసి విద్యా వ్యవస్థలో పారదర్శకత తీసుకురావాలని కోరారు. విద్యార్థులు, నిరుద్యోగుల సమస్యలను పరిష్కరించడంలో కేంద్ర ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. మంత్రి రాజీనామా చేయకపోతే దేశవ్యాప్తంగా ఉద్యమాలను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో సుభాష్, మారుతి, గణేష్, దీపలక్ష్మి, హరీష్, మెస్రం మారుతి, నాగేందర్ తదితరులు పాల్గొన్నారు.

విద్యార్థులపై బలప్రయోగం ప్రజాస్వామ్యానికి విరుద్ధం