Saturday, 15 August 2026
  • Home  
  • జ్యోతుల పాపారావు సాగునీటి పథకం ప్రారంభం 3500 ఎకరాలకు జీవకల
- తూర్పు గోదావరి

జ్యోతుల పాపారావు సాగునీటి పథకం ప్రారంభం 3500 ఎకరాలకు జీవకల

*జ్యోతుల పాపారావు సాగునీటి పథకం ప్రారంభోత్సవంతో 3500 ఎకరాలకు జీవజలం… రైతుల కల నెరవేరిన రోజు… ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ* *నిత్యం రైతు శ్రేయస్సు కోసం పని చేసే నాయకులు జ్యోతుల నెహ్రూ… సాగునీటి పథకం ప్రారంభోత్సవంలో రాజ్యసభ సభ్యులు సానా సతీష్* జగ్గంపేట మండలం, మామిడాడ, పున్నమి ప్రతినిధి , ఆగస్టు 15: 80వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా జగ్గంపేట మండలం మామిడాడలో 3 కోట్ల 82 లక్షల రూపాయలతో నిర్మించిన జ్యోతుల పాపారావు సాగునీటి పథకాన్ని ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ అధ్యక్షతన, రాజ్యసభ సభ్యులు సానా సతీష్ ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించి రైతులకు అంకితం చేశారు.3500 ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందించే ఈ పథకంతో మామిడాడ, ఇర్రిపాక, నరేంద్ర పట్నం, మర్రిపాక, గొల్లలగుంట గ్రామాల రైతులకు ఎంతో మేలు జరగనుంది.జ్యోతుల నెహ్రూ మాట్లాడుతూ ఈ ప్రాంతంలో 1600 ఎకరాల కైనా సాగు నీరివ్వాలన్న మా పెద్ద తండ్రి జ్యోతుల పాపారావు ప్రయత్నాలు చేసే వారు, వారి ఆశయాన్ని నెరవేర్చేందుకు ఈ పథకానికి శ్రీకారం చుట్టామని కూటమి ప్రభుత్వం, ముఖ్యమంత్రి చంద్రబాబు, నీటిపారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు సహకారంతో జిల్లా ఖనిజ ఫౌండేషన్, ప్రధానమంత్రి కృషి సించాయ్ యోజన నిధులతో ఈ పథకం పూర్తి చేశామన్నారు. సూపర్ ఎలీనో ప్రభావంతో రైతులు ఇబ్బందులు పడుతున్న సమయంలో ఈ ప్రాజెక్టు అందుబాటులోకి రావడం శుభపరిణామమన్నారు. ఈ పథకం వల్ల రైతులకు పెట్టుబడి తగ్గి దిగుబడులు పెరుగుతాయని, గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం అవుతుందని చెప్పారు.సానా సతీష్ మాట్లాడుతూ జ్యోతుల నెహ్రూ 1994 నుండి నిత్యం రైతు శ్రేయస్సు కోసం పనిచేస్తున్నారని అన్నారు. తక్కువ ఖర్చుతో ఎక్కువ ఆయకట్టుకు నీరందించడం ఆయన ప్రత్యేకత అన్నారు. రైతుల సంక్షేమంతో పాటు యువతకు ఉపాధి అవకాశాల కోసం స్కిల్ డెవలప్మెంట్ కార్యక్రమాలను మరింత విస్తరించాలని కోరారు. ఈ ప్రాంత అభివృద్ధి, సంక్షేమం, సాగునీరు, త్రాగునీరు కోసం జ్యోతుల నెహ్రూ నిరంతరం కృషి చేస్తున్న రైతు బాంధవుడని కొనియాడారు.ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ ఇన్చార్జి తుమ్మలపల్లి రమేష్, మార్కెట్ కమిటీ చైర్మన్ అడపా భరత్, పుష్కర ప్రాజెక్టు కమిటీ చైర్మన్ అడబాల భాస్కరావు, ఎస్వీఎస్ అప్పలరాజు, మారిశెట్టి భద్రం, పాలచర్ల నాగేంద్ర చౌదరి, పిల్ల చంటిబాబు, పోలవరం లెఫ్ట్ మెయిన్ కెనాల్ ఈఈ. దేవర శ్రీనివాసులు, డి ఈ వి ప్రసాద్, ఏ ఈ ఈ వంశీధర్, జంపన సీతారామచంద్ర వర్మ, బస్వా చినబాబు, బొడ్డేటి సుమన్, వేగి రామకృష్ణ స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు, పెద్ద ఎత్తున రైతులు పాల్గొన్నారు.

*జ్యోతుల పాపారావు సాగునీటి పథకం ప్రారంభోత్సవంతో 3500 ఎకరాలకు జీవజలం… రైతుల కల నెరవేరిన రోజు… ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ*

*నిత్యం రైతు శ్రేయస్సు కోసం పని చేసే నాయకులు జ్యోతుల నెహ్రూ… సాగునీటి పథకం ప్రారంభోత్సవంలో రాజ్యసభ సభ్యులు సానా సతీష్*

జగ్గంపేట మండలం, మామిడాడ, పున్నమి ప్రతినిధి , ఆగస్టు 15: 80వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా జగ్గంపేట మండలం మామిడాడలో 3 కోట్ల 82 లక్షల రూపాయలతో నిర్మించిన జ్యోతుల పాపారావు సాగునీటి పథకాన్ని ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ అధ్యక్షతన, రాజ్యసభ సభ్యులు సానా సతీష్ ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించి రైతులకు అంకితం చేశారు.3500 ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందించే ఈ పథకంతో మామిడాడ, ఇర్రిపాక, నరేంద్ర పట్నం, మర్రిపాక, గొల్లలగుంట గ్రామాల రైతులకు ఎంతో మేలు జరగనుంది.జ్యోతుల నెహ్రూ మాట్లాడుతూ ఈ ప్రాంతంలో 1600 ఎకరాల కైనా సాగు నీరివ్వాలన్న మా పెద్ద తండ్రి జ్యోతుల పాపారావు ప్రయత్నాలు చేసే వారు, వారి ఆశయాన్ని నెరవేర్చేందుకు ఈ పథకానికి శ్రీకారం చుట్టామని కూటమి ప్రభుత్వం, ముఖ్యమంత్రి చంద్రబాబు, నీటిపారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు సహకారంతో జిల్లా ఖనిజ ఫౌండేషన్, ప్రధానమంత్రి కృషి సించాయ్ యోజన నిధులతో ఈ పథకం పూర్తి చేశామన్నారు. సూపర్ ఎలీనో ప్రభావంతో రైతులు ఇబ్బందులు పడుతున్న సమయంలో ఈ ప్రాజెక్టు అందుబాటులోకి రావడం శుభపరిణామమన్నారు. ఈ పథకం వల్ల రైతులకు పెట్టుబడి తగ్గి దిగుబడులు పెరుగుతాయని, గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం అవుతుందని చెప్పారు.సానా సతీష్ మాట్లాడుతూ జ్యోతుల నెహ్రూ 1994 నుండి నిత్యం రైతు శ్రేయస్సు కోసం పనిచేస్తున్నారని అన్నారు. తక్కువ ఖర్చుతో ఎక్కువ ఆయకట్టుకు నీరందించడం ఆయన ప్రత్యేకత అన్నారు. రైతుల సంక్షేమంతో పాటు యువతకు ఉపాధి అవకాశాల కోసం స్కిల్ డెవలప్మెంట్ కార్యక్రమాలను మరింత విస్తరించాలని కోరారు. ఈ ప్రాంత అభివృద్ధి, సంక్షేమం, సాగునీరు, త్రాగునీరు కోసం జ్యోతుల నెహ్రూ నిరంతరం కృషి చేస్తున్న రైతు బాంధవుడని కొనియాడారు.ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ ఇన్చార్జి తుమ్మలపల్లి రమేష్, మార్కెట్ కమిటీ చైర్మన్ అడపా భరత్, పుష్కర ప్రాజెక్టు కమిటీ చైర్మన్ అడబాల భాస్కరావు, ఎస్వీఎస్ అప్పలరాజు, మారిశెట్టి భద్రం, పాలచర్ల నాగేంద్ర చౌదరి, పిల్ల చంటిబాబు, పోలవరం లెఫ్ట్ మెయిన్ కెనాల్ ఈఈ. దేవర శ్రీనివాసులు, డి ఈ వి ప్రసాద్, ఏ ఈ ఈ వంశీధర్, జంపన సీతారామచంద్ర వర్మ, బస్వా చినబాబు, బొడ్డేటి సుమన్, వేగి రామకృష్ణ స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు, పెద్ద ఎత్తున రైతులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.