ఖమ్మం జులై
(పున్నమి ప్రతి నిధి)
111వ సినిమా షూటింగ్ సందర్భంగా గాయపడిన ప్రముఖ సినీ నటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ ఖమ్మంకు చెందిన బాలయ్య అభిమాన సంఘం నాయకుడు నల్లమల్ల రంజిత్ మంగళవారం ఖమ్మంలోని ప్రముఖ దేవాలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఈ సందర్భంగా నల్లమల్ల రంజిత్ మాట్లాడుతూ, “బాలయ్య బాబు సంపూర్ణ ఆరోగ్యంతో త్వరగా కోలుకుని మళ్లీ సినీ, రాజకీయ రంగాల్లో ప్రజలకు సేవ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో ఉండాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నాం ” రంజిత్ తెలిపారు.



