విద్యార్థుల పై కేంద్ర ప్రభుత్వ వేధింపులు ఆపాలి. NTA ను రద్దు చేయాలి.
డిల్లీ పోరాట స్పూర్తి తో కేంద్ర ప్రభుత్వ వ్యతిరేక విధానాల పై పోరాటాలు సాగిస్తాం.
డిల్లీ లో జరిగిన విద్యార్థి పోరాట స్పూర్తితో కేంద్రం అనుసరిస్తున్న విద్యా వ్యతిరేక విధానాల పై పోరాటాలు సాగిద్దామని డిల్లీ ఉద్యమంలో పాల్గొన్న విద్యార్థుల పై వేధింపులు ఆపాలని,NTA ను రద్దు చేయాలని పటిష్ట విద్యా వ్యవస్థ తీసుకురావాలని లేకుంటే ప్రభుత్వానికి గుణపాఠం తప్పదని SFI, DYFI జిల్లా అధ్యక్ష,కార్యదర్శులు జలా.సుమంత్,వీరపోగు.రవి,ముడియం.చిన్ని,వీరణాల.శివకుమార్ తెలిపారు. బుధవారం నాడు రాష్ట్ర వ్యాప్త పిలుపు లో భాగంగా కడప కలెక్టరేట్ వద్ద SFI, DYFI ఆధ్వర్యంలో నిరసన దీక్ష చేశారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఉన్నత విద్య పూర్తిగా భ్రష్టు పట్టిందని అన్నారు.అందుకు ఉదాహరణనే నీట్ పరీక్షా విధానం అన్నారు.బీజేపీ ప్రభుత్వం లో ఇప్పటికే నీట్ పేపర్ 89 సార్లు లీకేజీ అయ్యిందని అన్నారు.NTA పూర్తిగా విఫలం చెందిందని అన్నారు.నీట్ పేపర్ లీకేజీ కారణంగా ఎంతో మంది విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకున్నారని అన్నారు.ఈ ఆత్మహత్యలు అన్ని ప్రభుత్వ హత్యలుగానే భావిస్తున్నామని అన్నారు.లక్షలాది మంది విద్యార్థులు భవిష్యత్ అంధకారం కాకూడదని కడుపుమంది డిల్లీ లో పోరాటం సాగించి కేంద్రం మెడలు వంచి కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాల్సి వచ్చిందని అన్నారు.NTA బీజేపీ జేబు సంస్థగా తయారయ్యింది అన్నారు. పేదవాడి కలలను ఛిద్రం చేస్తుందని అన్నారు.డిల్లీ పోరాటంలో పాల్గొన్న విద్యార్థులపై కేసులు నమోదు చేస్తూ భయబ్రాంతులకు గురి చేసే విధంగా వేధింపులకు పాల్పడుతున్నదని ఈ చర్యని వ్యతిరేకిస్తూ ఖండిస్తున్నామని అన్నారు.ఇప్పటికే కేంద్రానికి చెంపపెట్టులగా డిల్లీ ఉద్యమం జరిగిందని మళ్ళీ ఇప్పుడు వేధింపులకు గురి చేస్తే పతనం తప్పదని హెచ్చరించారు.ఇప్పటికైన కేంద్రం విద్యార్థుల పై వేధింపులు ఆపాలని NTA రద్దు చేసి పటిష్ట విద్యా వ్యవస్థను తీసుకురావాలని డిమాండ్ చేస్తున్నామని డిల్లీ ఉద్యమ స్పూర్తితో మరో పోరాటం తప్పదని అన్నారు.కార్యక్రమంలో SFI, DYFI నాయకులు విజయ్,అఖిలేష్,పెద్దన్న, ఆదిల్, అభినయ్,యువరాజు,నవీన్,వేణు,శ్రీను తదితరులు పాల్గొన్నారు.కార్యక్రమానికి రైతు సంఘం,జిల్లా కార్యదర్శి దస్తగిరి రెడ్డి, CITU జిల్లా కార్యదర్శి మనోహర్,నాయకులు శ్రీను, ఇద్యా నాయకురాలు ఐ. యన్.సుబ్బమ్మ, ఆప్కాస్ రాష్ట్ర కార్యదర్శి సుబ్బయ్య, కెవిపిఎస్ నగర్ కార్యదర్శి నరసింహ సంఘీభావం తెలిపారు.

