Sunday, 17 May 2026
  • Home  
  • వికసిత భారత్ బిల్డథాన్–2025 విజేతలుగా చిట్వేల్ విద్యార్థులు
- అన్నమయ్య

వికసిత భారత్ బిల్డథాన్–2025 విజేతలుగా చిట్వేల్ విద్యార్థులు

వికసిత భారత్–2047 లక్ష్యాలకు అనుగుణంగా ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్ (AICTE), కేంద్ర విద్యాశాఖ మరియు అటల్ ఇన్నోవేషన్ మిషన్ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన దేశవ్యాప్త “వికసిత భారత్ బిల్డథాన్–2025” ప్రోటోటైప్ మోడల్ రూపకల్పన పోటీలలో చిట్వేల్ పీఎం శ్రీ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులు ప్రతిభ చాటారు.పదవ తరగతి విద్యార్థినులు పి. భవ్య, ఈశ్వరి, గాయత్రి మరియు స్వప్న రూపొందించిన “వ్యర్థ ప్లాస్టిక్ సీసాలకు రాగి పూత అతికించి 3D రాగి సీసాలుగా మార్పిడి” ప్రాజెక్ట్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి జాతీయ స్థాయికి ఎంపికైంది. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం విద్యార్థులకు రూ.10,000 నగదు బహుమతి ప్రకటించినట్లు అన్నమయ్య జిల్లా విద్యాశాఖ అధికారి డాక్టర్ సుబ్రహ్మణ్యం మరియు జిల్లా సైన్స్ అధికారి మార్ల ఓబుల్ రెడ్డి తెలిపారు.ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు బి. దుర్గరాజు మాట్లాడుతూ, ఇదే ప్రోటోటైప్ మోడల్‌కు భారత ప్రభుత్వ పేటెంట్ కార్యాలయం చెన్నై శాఖ ఇప్పటికే పేటెంట్ మంజూరు చేసిందన్నారు. విద్యార్థుల్లో సృజనాత్మకత, ఆవిష్కరణలు మరియు శాస్త్రీయ దృక్పథం పెంపొందించేందుకు కేంద్ర ప్రభుత్వం పాఠశాల స్థాయిలో ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమని పేర్కొన్నారు. అనంతరం ఎంపికైన విద్యార్థులను మెడల్స్‌తో సత్కరించారు.ప్రాజెక్ట్ గైడ్ టీచర్ శివ నారాయణ గౌడ్ మాట్లాడుతూ, “వికసిత భారత్ కార్యక్రమం ద్వారా విద్యార్థులను భవిష్యత్తు భారత నిర్మాణంలో భాగస్వాములుగా తీర్చిదిద్దుతూ, పాఠశాల స్థాయిలోనే ఆవిష్కరణలు, విజ్ఞానం మరియు నాయకత్వ లక్షణాలు పెంపొందించడం ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశ్యం” అని తెలిపారు.జాతీయ స్థాయికి ఎంపికైన విద్యార్థులను, గైడ్ టీచర్ శివ నారాయణ గౌడ్‌ను ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయ బృందం మరియు విద్యార్థుల తల్లిదండ్రులు అభినందించారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.