-మలేమాపురంలో పంటల పరిశీలన
-రైతుల సమస్యలు తెలుసుకున్న ప్రజాప్రతినిధులు
-పరిహారం కోసం చర్యలకు హామీ
-ఎన్డీఏ నాయకులు, అధికారులు పాల్గొన్నారు
చిట్వేల్ మండలం మలేమార్పురం గ్రామంలో అకస్మాత్తుగా కురిసిన గాలి వానల కారణంగా అరటి, నూగు, మొక్కజొన్న పంటలు తీవ్రంగా నష్టపోయాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వ విప్, రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ గ్రామాన్ని సందర్శించి నష్టపోయిన పంటలను పరిశీలించారు. ప్రభావిత రైతులను పరామర్శించి వారి సమస్యలను ఆత్మీయంగా తెలుసుకున్నారు.పంట నష్టాన్ని ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి, రైతులకు తగిన పరిహారం అందేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా నష్టంతో బాధపడుతున్న సానేపల్లి రామచంద్రను ధైర్యం చెబుతూ ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా కల్పించారు.ఈ కార్యక్రమంలో తెలుగుదేశం యువ నాయకులు ముక్కా సాయి వికాస్ రెడ్డి, జనసేన నాయకులు మాదాసు నరసింహ, ఉప్పలపాటి శివప్రసాద్ రాజు, మద్దూరి మన్మధ, గొబ్బిళ్ళ చంగల్ రాయుడు, బొంతల నాగేశ్వరరావు, పెద్దం గారి సాయి, మాదినేని రాజా, పవన్ రాజు, తోట శివప్రసాద్ తదితర ఎన్డీఏ కూటమి నాయకులు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.


