వరంగల్
MRPS MSP జాతీయ సదస్సు…
ముఖ్య అతిథిగా పాల్గొన్న పద్మశ్రీ మంద కృష్ణ మాదిగ గారు….
వరంగల్ లోని సత్యసాయి కన్వెన్షన్ హాల్ లో MRPS MSP జాతీయ సదస్సు జరుగుతుంది.
ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ , తెలంగాణలో రద్దయిన జిల్లా కమిటీల బాధ్యులు , రద్దు కాబడిన మండల కమిటీ బాధ్యులు మరియు గతంలో ఉద్యమంలో నిజాయితీగా పని చేసిన సీనియర్ నాయకులు , మరియు జాతీయ రాష్ట్ర స్థాయి నేతలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా MRPS వ్యవస్థాపక అధ్యక్షులు ” పద్మశ్రీ” మంద కృష్ణ మాదిగ గారు పాల్గొన్నారు.
ముందుగా ఉద్యమ ప్రస్థానం , సంస్థాగత నిర్మాణాలు, నాయకత్వం ఎదుగుదల, మొదలగు అంశాల మీద మంద కృష్ణ మాదిగ గారు సందేశం ఇచ్చారు.
అనంతరం ఉద్యమ కార్యాచరణ మీద చర్చ జరుగుతుంది.
ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ , తెలంగాణ రాష్ట్రాల నుండి వేలాది మంది నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.
మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి -( MRPS)



