ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా జూన్ 20 ( పున్నమి ప్రతినిధి)
మనుబోలు, జూన్ 20: మనుబోలు మండలం వడ్లపూడి గ్రామంలోని గ్రామదేవత శ్రీ పొన్నూరు అమ్మతల్లి జాతర సందర్భంగా నిర్వహించిన ఎడ్ల పందాలు ఉత్కంఠభరితంగా సాగాయి. 1,700 కిలోల బరువున్న రాయిని కట్టి 250 మీటర్ల దూరాన్ని అత్యల్ప సమయంలో పూర్తి చేసే పోటీలో 9 జతల ఎడ్లు పాల్గొన్నాయి. తొలి బహుమతిని పొట్టేపాలెంకు చెందిన లెనిన్ ఎంటర్‌ప్రైజెస్ గెలుచుకోగా, ద్వితీయ బహుమతి జొన్నవాడకు చెందిన మద్దిశెట్టి వెంకయ్య, తృతీయ బహుమతి లెనిన్ ఎంటర్‌ప్రైజెస్ మరో జత, నాలుగో బహుమతి గుడ్లవేడు గ్రామానికి చెందిన వేట్లూరు సుధీర్, ఐదో బహుమతి తాటిపర్తికి చెందిన పంట సురేందర్ రెడ్డి దక్కించుకున్నారు. ఈ పోటీలను తిలకించేందుకు జిల్లా నలుమూలల నుంచి వందలాది మంది తరలివచ్చారు.

వడ్లపూడి పొన్నూరు అమ్మతల్లి జాతరలో ఉత్కంఠభరితంగా ఎడ్ల పందాలు
ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా జూన్ 20 ( పున్నమి ప్రతినిధి) మనుబోలు, జూన్ 20: మనుబోలు మండలం వడ్లపూడి గ్రామంలోని గ్రామదేవత శ్రీ పొన్నూరు అమ్మతల్లి జాతర సందర్భంగా నిర్వహించిన ఎడ్ల పందాలు ఉత్కంఠభరితంగా సాగాయి. 1,700 కిలోల బరువున్న రాయిని కట్టి 250 మీటర్ల దూరాన్ని అత్యల్ప సమయంలో పూర్తి చేసే పోటీలో 9 జతల ఎడ్లు పాల్గొన్నాయి. తొలి బహుమతిని పొట్టేపాలెంకు చెందిన లెనిన్ ఎంటర్‌ప్రైజెస్ గెలుచుకోగా, ద్వితీయ బహుమతి జొన్నవాడకు చెందిన మద్దిశెట్టి వెంకయ్య, తృతీయ బహుమతి లెనిన్ ఎంటర్‌ప్రైజెస్ మరో జత, నాలుగో బహుమతి గుడ్లవేడు గ్రామానికి చెందిన వేట్లూరు సుధీర్, ఐదో బహుమతి తాటిపర్తికి చెందిన పంట సురేందర్ రెడ్డి దక్కించుకున్నారు. ఈ పోటీలను తిలకించేందుకు జిల్లా నలుమూలల నుంచి వందలాది మంది తరలివచ్చారు.

