ఖానాపురం పున్నమి ప్రతినిధి: నల్లబెల్లి మండలం లెంకలపల్లి గ్రామ బీఆర్ఎస్ పార్టీ సర్పంచ్ కస్తూరి విజయలక్ష్మి గారి పార్థివ దేహాన్ని గౌరవ మాజీ మంత్రివర్యులు శ్రీ ఎర్రబెల్లి దయాకర్ రావు గారు సందర్శించి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు
వారి కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఈ విషాద సమయంలో కుటుంబ సభ్యులకు ధైర్యంగా ఉండాలని సూచించారు..
ఈ కార్యక్రమంలో: మాజీ జిల్లా పరిషత్ వైస్ చైర్మన్, నర్సంపేట నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ నాయకులు,మండల పార్టీ అధ్యక్షులు,ప్రజా ప్రతినిధులు మాజీ ప్రజా ప్రతినిధులు, సర్పంచులు. పార్టీ ముఖ్య నాయకులు, పార్టీ నాయకులు,కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు..



