పున్నమి ప్రతినిధి ఆనంద్ :
అనకాపల్లి జిల్లా వ్యాప్తంగా తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొని, రైతాంగం, వ్యవసాయ కూలీలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని వెంటనే అన్ని గ్రామాల్లో ఉపాధి హామీ పనులు కల్పించి గ్రామీణ ప్రజలను ఆదుకోవాలని సిఐటియు జిల్లా కార్యదర్శి ఆర్ .రాము డిమాండ్
జిల్లాలో ఖరీఫ్ సీజన్ లో 60% వరకు వర్షాభావం ఏర్పడింది.రిజర్వాయర్లలో నీటి మట్టం అడుగంటింది. భూగర్భ జలాలు 300 అడుగులకు పడిపోయాయి.పనులు లేక అనకాపల్లి జిల్లాలో వేలాది మంది వ్యవసాయ కూలీలు, వలస వెళ్ళే పరిస్థితి నెలకొంది ఉపాధి హామీ పథకం ద్వారా పనులు కల్పించి పేదలను ఆదుకోవాలని అనకాపల్లి జిల్లాను కరువు ప్రాంతంగా ప్రకటించి తక్షణ సహాయ చర్యలు తీసుకొని సంవత్సరానికి 200 రోజులు పని కల్పించాలని ఎకరానికి 25000 నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్


