నాగిరెడ్డిపల్లెకు చెందిన బోనాసి వంశీ అనే యువకుడు బెంగళూరులో జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విషయం తెలుసుకున్న నందలూరు లయన్స్ క్లబ్, వాకర్స్ క్లబ్ సభ్యులు మానవత్వాన్ని చాటుకున్నారు.క్లిష్ట పరిస్థితుల్లో చికిత్స పొందుతున్న వంశీ కుటుంబానికి సహాయంగా క్లబ్ ఫండ్ నుండి రూ.20 వేలతో పాటు పలువురు దాతల సహకారంతో మొత్తం రూ.72 వేల ఆర్థిక సహాయాన్ని వంశీ తండ్రి బోనాసి కిషోర్‌కు అందజేశారు.ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ ప్రమాదంలో తీవ్రంగా గాయపడి ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న కుటుంబానికి మరింత మంది దాతలు ముందుకు వచ్చి సహాయం చేయాలని కోరారు.ఈ కార్యక్రమంలో డాక్టర్ జయభాస్కర్ రావు, లయన్ మన్నెం రామమోహన్ ఎస్ఐ, లయన్ కుర్రా మణియాదవ్, ఉప్పుశెట్టి సుధీర్ (వాకర్స్ క్లబ్ అధ్యక్షుడు), దాసరి నరసింహులు (అడ్వకేట్), మోడపోతుల రాము, గంధం గంగాధర్, మంటి మారయ్య, జంగంశెట్టి చంద్ర, గుండు సురేష్ తదితరులు పాల్గొన్నారు.

లయన్స్, వాకర్స్ క్లబ్‌ల ఆధ్వర్యంలో రూ.72 వేల అందజేత