రైతుల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం – ఎమ్మెల్యే కాకర్ల సురేష్
అన్నదాత సుఖీభవ – పీఎం కిసాన్ తొలి విడత నిధుల విడుదల కార్యక్రమంలో ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్ పాల్గొన్నారు. రైతులతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు. రాష్ట్రవ్యాప్తంగా సీఎం చంద్రబాబు విడుదల చేసిన రూ.3,125 కోట్ల నిధుల కార్యక్రమాన్ని రైతులతో కలిసి వీక్షించారు. ఈ విడతలో రైతుల ఖాతాల్లో రూ.7 వేల చొప్పున జమ చేసినట్లు తెలిపారు. నెల్లూరు జిల్లాలో 1.77 లక్షల మంది రైతులకు రూ.117.16 కోట్లు, ఉదయగిరి నియోజకవర్గంలో 45,275 మంది రైతులకు రూ.30.05 కోట్లు అందినట్లు వెల్లడించారు. రైతులు ఆధునిక వ్యవసాయ పద్ధతులు అవలంబించాలని సూచించారు.

రైతుల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం – ఎమ్మెల్యే కాకర్ల సురేష్
రైతుల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం – ఎమ్మెల్యే కాకర్ల సురేష్ అన్నదాత సుఖీభవ – పీఎం కిసాన్ తొలి విడత నిధుల విడుదల కార్యక్రమంలో ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్ పాల్గొన్నారు. రైతులతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు. రాష్ట్రవ్యాప్తంగా సీఎం చంద్రబాబు విడుదల చేసిన రూ.3,125 కోట్ల నిధుల కార్యక్రమాన్ని రైతులతో కలిసి వీక్షించారు. ఈ విడతలో రైతుల ఖాతాల్లో రూ.7 వేల చొప్పున జమ చేసినట్లు తెలిపారు. నెల్లూరు జిల్లాలో 1.77 లక్షల మంది రైతులకు రూ.117.16 కోట్లు, ఉదయగిరి నియోజకవర్గంలో 45,275 మంది రైతులకు రూ.30.05 కోట్లు అందినట్లు వెల్లడించారు. రైతులు ఆధునిక వ్యవసాయ పద్ధతులు అవలంబించాలని సూచించారు.

