✍️రెడ్డి సత్య సుబ్రహ్మణ్యం
పున్నమి సీనియర్ రిపోర్టర్
9989086083
రైతుల సంక్షేమమే కూటమి ప్రభుత్వ లక్ష్యం – ఎమ్మెల్యే చిర్రి బాలరాజు.
సుమారు 100 కార్లతో బర్రింకలపాడు నుండి బుట్టాయగూడెం వరకు భారీ ర్యాలీ.
బుట్టాయగూడెం ఎంపీడీఓ కార్యాలయం ఆవరణలో నిర్వహించిన అన్నదాత సుఖీభవ – పీఎం కిసాన్ (రైతన్న మీకోసం) 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన తొలి విడత నిధుల పంపిణీ కార్యక్రమంలో పోలవరం శాసనసభ్యులు చిర్రి బాలరాజు ముఖ్య అతిథిగా పాల్గొని లబ్ధిదారులైన రైతులకు చెక్కులను అందజేశారు.
ముందుగా బర్రింకలపాడు క్యాంపు కార్యాలయం నుండి బుట్టాయగూడెం ఎంపీడీఓ కార్యాలయం వరకు 100 కార్లతో భారీ ర్యాలీ నిర్వహించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, వ్యవసాయాన్ని లాభసాటి రంగంగా తీర్చిదిద్దడం, రైతు కుటుంబాలను ఆర్థికంగా బలోపేతం చేయడం కూటమి ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని అన్నారు. ఎన్నికల సమయంలో రైతులకు ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తున్నామని, అందులో భాగంగానే అన్నదాత సుఖీభవ – పీఎం కిసాన్ పథకం ద్వారా రైతులకు నేరుగా ఆర్థిక సాయం అందిస్తున్నట్లు తెలిపారు.
పోలవరం నియోజకవర్గ పరిధిలోని బుట్టాయగూడెం, జీలుగుమిల్లి, కొయ్యలగూడెం, పోలవరం, టి.నరసాపురం, కుక్కునూరు,వేలేరుపాడు, మండలాలకు చెందిన అర్హులైన రైతులకు 2026-27 ఆర్థిక సంవత్సరపు తొలి విడతగా రూ.22.50 కోట్ల నిధులు విడుదలయ్యాయని ఎమ్మెల్యే వెల్లడించారు. ఈ నిధులు రైతుల బ్యాంకు ఖాతాల్లో నేరుగా జమ కావడం ద్వారా విత్తనాలు, ఎరువులు, పురుగుమందులు మరియు ఇతర వ్యవసాయ అవసరాలకు ఉపయోగపడతాయని పేర్కొన్నారు.
గత ప్రభుత్వ హయాంలో రైతులు అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారని, రైతులకు సమయానికి సహాయం అందక వ్యవసాయ వ్యయాలు పెరిగిపోయాయని అన్నారు. అయితే ప్రస్తుతం రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత రైతుల సంక్షేమానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తూ పలు సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తోందని చెప్పారు. రైతు కుటుంబాల అభివృద్ధే రాష్ట్ర అభివృద్ధికి పునాది అని పేర్కొన్నారు.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం రైతుల సంక్షేమం కోసం పీఎం కిసాన్ వంటి పథకాలను అమలు చేస్తుండగా, రాష్ట్ర ప్రభుత్వం అన్నదాత సుఖీభవ పథకం ద్వారా అదనపు సహకారం అందిస్తోందని ఎమ్మెల్యే తెలిపారు. రైతులకు ఆర్థిక భరోసా కల్పించడమే కాకుండా వ్యవసాయ రంగాన్ని మరింత బలోపేతం చేయడమే ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు.
పోలవరం నియోజకవర్గంలోని ప్రతి గ్రామంలో రైతులకు అవసరమైన మౌలిక సదుపాయాల కల్పనకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని, సాగునీటి వనరుల అభివృద్ధి, కాలువల మరమ్మతులు, ఎత్తిపోతల పథకాల నిర్వహణ, వ్యవసాయ విద్యుత్ సరఫరా మెరుగుదల వంటి అంశాలపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని చెప్పారు. రైతులు ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కొన్నా ప్రజాప్రతినిధులు, వ్యవసాయ శాఖ అధికారుల దృష్టికి తీసుకురావాలని సూచించారు.
వ్యవసాయ రంగంలో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకొని అధిక దిగుబడులు సాధించాలని రైతులకు ఎమ్మెల్యే సూచించారు. ప్రభుత్వం అందిస్తున్న అన్ని సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకొని ఆర్థికంగా మరింత బలోపేతం కావాలని ఆకాంక్షించారు.
అనంతరం పలువురు రైతులు మాట్లాడుతూ, రైతుల కోసం ప్రత్యేకంగా నిధులు విడుదల చేసి ఆర్థిక చేయూత అందిస్తున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు కృతజ్ఞతలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో ట్రైకర్ చైర్మన్ బొరగం శ్రీనివాస్,Amc వైస్ చైర్మన్ కొండేపాటి రామకృష్ణ,మాజీ Amc చైర్మన్ పారేపల్లి రామారావు,టీడీపీ అధ్యక్షులు మొగపర్తి సోంబాబు ,నాయుడు రామకృష్ణ గౌడ్,టీడీపీ సీనియర్ నాయకులు జయవరపు శ్రీ రామ్ మూర్తి, కాల్నీడి రాంబాబు,సొసైటీ అధ్యక్షులు దుగ్గిన శ్రీనివాస్, సరిపల్లి సత్యనారాయణ రాజు,Amc డైరెక్టర్ లు తొమ్మిదేళ్ళ శ్రీను,జట్ల సత్యనారాయణ,కూటమి నాయకులు పూనెం రాజా,తీగల గోపాలకృష్ణ,సంకుల రామకృష్ణ,రాయి సుబ్బారావు,ఎంపీసీ నాలి శ్రీనివాస్,వ్యవసాయ శాఖ ఏడి బుజ్జిబాబు,తహశీల్దార్ భ్రమ ద్వారా,ఇంచార్జ్ ఎంపీడీఓ కిరణ్,ఏవో బాలాజీ, ఏవో లు బాలరాజు,గంగాధరం,
ప్రజాప్రతినిధులు, వివిధ శాఖల అధికారులు, కూటమి పార్టీ నాయకులు, కార్యకర్తలు, రైతు సంఘాల ప్రతినిధులు, పెద్ద సంఖ్యలో రైతులు పాల్గొన్నారు.
END

