మహిళలు ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేసి ఆర్థికంగా స్థిరపడాలని నాగర్‌కర్నూల్ ఎమ్మెల్యే డాక్టర్ కూచుకుళ్ల రాజేష్ రెడ్డి పిలుపునిచ్చారు. ప్రజా పాలన – ప్రగతి ప్రణాళికలో భాగంగా నిర్వహించిన మహిళా వారోత్సవాల సభలో ఆయన పాల్గొన్నారు. స్వయం సహాయక సంఘాల సభ్యులకు ఇందిరా మహిళా శక్తి చీరలను అందజేశారు. పార్టీలకు అతీతంగా ప్రజా సేవ చేయడమే తమ ప్రభుత్వ లక్ష్యమన్నారు. జూన్ 3న మంత్రి సీతక్క చేతుల మీదుగా నూతన మహిళా శక్తి భవనాన్ని ప్రారంభించబోతున్నట్లు ప్రకటించారు.


