పున్నమి ప్రతినిధి తాళ్లపూడి తూర్పుగోదావరి జిల్లా జులై 8:
తాళ్లపూడి మండల పరిధిలోని తాడిపూడి ఎత్తిపోతల పథకం ద్వారా ఖరీఫ్ పంటకు నీటి విడుదల కార్యక్రమాన్ని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు గురువారం ఘనంగా ప్రారంభించారు.
కార్యక్రమానికి ముందు పండితులు వేద మంత్రాలు చదువుతుండగా మంత్రి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం కొబ్బరికాయ కొట్టి స్విచ్ ఆన్ చేసి ఎత్తిపోతల ద్వారా కాలువల్లోకి నీటిని విడుదల చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన తెలుగుదేశం నాయకులు, ప్రముఖులు మరియు విలేకరుల సమావేశంలో మంత్రి మాట్లాడారు.
రైతుల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని, ఖరీఫ్ సీజన్‌లో ఎలాంటి ఇబ్బందులు లేకుండా సకాలంలో నీరు అందించేందుకు చర్యలు తీసుకున్నామని మంత్రి తెలిపారు. తాడిపూడి ఎత్తిపోతల పథకం ద్వారా వేలాది ఎకరాలకు సాగునీరు అందుతుందని, దీనివల్ల రైతులు అధిక దిగుబడులు సాధిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు.
ఈ కార్యక్రమంలో అధికారులు (ఈఈ) బి. యేసు బాబు, (డిఈ) ఎన్. రామేశ్వర్ నాయుడు, టి.అప్పారావు, (ఎఈఈ) వై. హర్షవర్ధన్, ఈ. శ్రీనివాసులు, సి హెచ్. భార్గవ్ శంకర్ నాయకులు కొవ్వూరు ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు, గోపాలపురం ఎమ్మెల్యే మద్దిపట్ల వెంకట రాజు, బొరగం శ్రీనివాస్,తాళ్లపూడి ఏం.ఆర్.ఓ లక్ష్మీ లావణ్య,రాజమండ్రి పార్లమెంటరీ అధికార ప్రతినిధి నామన పరమేశ్వరరావు,తాళ్లపూడి మండల తెలుగుదేశంపార్టీ అధ్యక్షుడు సిద్ధ దుర్గారావు,కైకాల శ్రీనివాస్, సూరపనేని చిన్ని, గన్నిన సత్తిబాబు, కొప్పాక కోట్నిస్, తాళ్లపూడి ఏం.ఆర్.ఓ లక్ష్మీ లావణ్య,నామా నరేంద్ర కుమార్, కందుల నాగు, అనపర్తి ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
ఎత్తిపోతల ద్వారా నీరు విడుదల కావడంతో ఖరీఫ్ పంట సాగుకు ఉపయోగపడుతుందని రైతులు హర్షం వ్యక్తం చేసి మంత్రికి, ఎమ్మెల్యేలకు కృతజ్ఞతలు తెలిపారు.




