ఎస్.రాయవరం, ఆగస్టు 15 (పున్నమి న్యూస్ రిపోర్టర్ ఆనంద్):
ఎస్.రాయవరం మండలం రేవుపోలవరం జెడ్పీహెచ్ఎస్లో 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు హెచ్ఎం అరుణ గారి ఆధ్వర్యంలో శనివారం ఘనంగా నిర్వహించారు. విద్యార్థులు ఆటపాటలు, సాంస్కృతిక కార్యక్రమాలతో ఉత్సాహంగా పాల్గొని స్వాతంత్ర్య వేడుకలను ఘనంగా జరుపుకున్నారు.
ఈ సందర్భంగా హెచ్ఎం అరుణ మాట్లాడుతూ.. స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాల ఫలితంగానే మనకు స్వేచ్ఛ లభించిందని, విద్యార్థులు దేశ చరిత్ర, స్వాతంత్ర్య పోరాటం గురించి తెలుసుకుని దేశభక్తి, క్రమశిక్షణ, బాధ్యతాయుత పౌరులుగా ఎదగాలని సూచించారు. దేశ అభివృద్ధిలో విద్యార్థుల పాత్ర ఎంతో కీలకమని తెలిపారు.
పాఠశాల అభివృద్ధికి తమవంతు సహకారం అందించిన దాతలు చోడిపల్లి ఎర్రారావు, చోడిపల్లి బంగారి, వాసిపల్లి ఆడవిరాజు, వాసిపల్లి రమణబాబులను ఈ సందర్భంగా ఘనంగా సన్మానించారు.
కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పాఠశాల చైర్మన్ అర్జిల్లి ఎర్రయ్య, హెచ్ఎం అరుణ పాల్గొన్నారు. ఉపాధ్యాయులు రాజారావు, లోవరాజు, గోవింద్, బంగారి, అప్పన్న, కె.లోవరాజు కె. ప్రవీణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు
పాఠశాల పీడీ మాస్టర్ బి.కృష్ణ మరియు శ్రేయోభిలాషుల చేతుల మీదుగా విద్యార్థులకు గుర్తింపు కార్డులు పంపిణీ చేశారు. అలాగే అథ్లెటిక్స్ పోటీల్లో ప్రతిభ కనబరిచి విజేతలుగా నిలిచిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు.
విద్యార్థుల ఉత్సాహభరితమైన ఆటపాటలు, సాంస్కృతిక కార్యక్రమాలతో రేవుపోలవరం జెడ్పీహెచ్ఎస్లో స్వాతంత్ర్య వేడుకలు సందడిగా, దేశభక్తి భావాన్ని చాటుతూ ఘనంగా ముగిశాయి.

రేవుపోలవరం జెడ్పీహెచ్ఎస్లో ఘనంగా 80వ స్వాతంత్ర్య వేడుకలు..!
ఎస్.రాయవరం, ఆగస్టు 15 (పున్నమి న్యూస్ రిపోర్టర్ ఆనంద్): ఎస్.రాయవరం మండలం రేవుపోలవరం జెడ్పీహెచ్ఎస్లో 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు హెచ్ఎం అరుణ గారి ఆధ్వర్యంలో శనివారం ఘనంగా నిర్వహించారు. విద్యార్థులు ఆటపాటలు, సాంస్కృతిక కార్యక్రమాలతో ఉత్సాహంగా పాల్గొని స్వాతంత్ర్య వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా హెచ్ఎం అరుణ మాట్లాడుతూ.. స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాల ఫలితంగానే మనకు స్వేచ్ఛ లభించిందని, విద్యార్థులు దేశ చరిత్ర, స్వాతంత్ర్య పోరాటం గురించి తెలుసుకుని దేశభక్తి, క్రమశిక్షణ, బాధ్యతాయుత పౌరులుగా ఎదగాలని సూచించారు. దేశ అభివృద్ధిలో విద్యార్థుల పాత్ర ఎంతో కీలకమని తెలిపారు. పాఠశాల అభివృద్ధికి తమవంతు సహకారం అందించిన దాతలు చోడిపల్లి ఎర్రారావు, చోడిపల్లి బంగారి, వాసిపల్లి ఆడవిరాజు, వాసిపల్లి రమణబాబులను ఈ సందర్భంగా ఘనంగా సన్మానించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పాఠశాల చైర్మన్ అర్జిల్లి ఎర్రయ్య, హెచ్ఎం అరుణ పాల్గొన్నారు. ఉపాధ్యాయులు రాజారావు, లోవరాజు, గోవింద్, బంగారి, అప్పన్న, కె.లోవరాజు కె. ప్రవీణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు పాఠశాల పీడీ మాస్టర్ బి.కృష్ణ మరియు శ్రేయోభిలాషుల చేతుల మీదుగా విద్యార్థులకు గుర్తింపు కార్డులు పంపిణీ చేశారు. అలాగే అథ్లెటిక్స్ పోటీల్లో ప్రతిభ కనబరిచి విజేతలుగా నిలిచిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు. విద్యార్థుల ఉత్సాహభరితమైన ఆటపాటలు, సాంస్కృతిక కార్యక్రమాలతో రేవుపోలవరం జెడ్పీహెచ్ఎస్లో స్వాతంత్ర్య వేడుకలు సందడిగా, దేశభక్తి భావాన్ని చాటుతూ ఘనంగా ముగిశాయి.

