Wednesday, 26 August 2026
  • Home  
  • రాష్ట్ర స్థాయి సాఫ్ట్‌బాల్ పోటీలకు శ్రీ శాంతినికేతన్ విద్యార్థుల
- నంద్యాల

రాష్ట్ర స్థాయి సాఫ్ట్‌బాల్ పోటీలకు శ్రీ శాంతినికేతన్ విద్యార్థుల

నంద్యాల:విజయనగరం జిల్లాలో సెప్టెంబర్ 11 నుండి 13 వరకు జరగనున్న రాష్ట్ర స్థాయి సబ్-జూనియర్ సాఫ్ట్‌బాల్ ఛాంపియన్‌షిప్‌ పోటీలకు ఉమ్మడి కర్నూలు జిల్లా జట్టు తరఫున నంద్యాల క్రాంతినగర్‌లోని శ్రీ శాంతినికేతన్ పాఠశాల విద్యార్థులు ఎంపికయ్యారు.ఈ నెల 22న కర్నూలు ఏ-క్యాంప్‌లోని మాంటిస్సోరి హైస్కూల్ మైదానంలో జిల్లా సాఫ్ట్‌బాల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఎంపిక పోటీలలో పాఠశాలకు చెందిన 10వ తరగతి విద్యార్థులు బి. తరుణ్ కుమార్ రెడ్డి, ఎస్. సుదీప్ కుమార్ రెడ్డి, ఎ. బాలాదిత్య, ఎమ్. సంతోష్ అత్యుత్తమ ప్రతిభ కనబరిచి స్థానం దక్కించుకున్నారు.రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికైన క్రీడాకారులను పాఠశాల చైర్మన్ సుధాకర్ ప్రత్యేకంగా అభినందించారు. విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లోనూ రాణించడం అభినందనీయమని, రాష్ట్ర స్థాయి పోటీల్లోనూ ఉత్తమ ప్రదర్శన కనబరచాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల కరస్పాండెంట్, ప్రిన్సిపాల్, పీఈటీలు మరియు ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.