Wednesday, 22 July 2026
  • Home  
  • రాష్ట్ర ప్రభుత్వ రెండేళ్ల పాలనపై ఇంటింటా సర్వేను విజయవంతం చేయాలి : ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజు
- డా. బిఆర్ అంబేద్కర్ కోనసీమ

రాష్ట్ర ప్రభుత్వ రెండేళ్ల పాలనపై ఇంటింటా సర్వేను విజయవంతం చేయాలి : ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజు

డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం పరిధిలోని ఐ పోలవరం మండలం మురమళ్ళ గ్రామంలో ఎమ్మెల్యే కార్యాలయంలో బుధవారం తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యాలయం ఆదేశాల మేరకు నియోజకవర్గ స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి శాసనసభ విప్ మరియు ముమ్మిడివరం శాసనసభ్యులు దాట్ల సుబ్బరాజు హాజరై పార్టీ నాయకులు, కార్యకర్తలకు పలు సూచనలు చేసి దిశా నిర్దేశం చేశారు. ఈ నెల 27వ తేదీ నుంచి రాష్ట్ర ప్రభుత్వ రెండేళ్ల పాలన, సంక్షేమ పథకాలు మరియు అభివృద్ధి కార్యక్రమాలపై నిర్వహించనున్న ఇంటింటా సర్వే కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ప్రజలకు ప్రభుత్వ విజయాలను, అమలు చేస్తున్న సంక్షేమ పథకాల ఫలాలను సమర్థవంతంగా వివరించాలని సూచించారు. ఈ సందర్భంగా మండల పార్టీ అధ్యక్షులు, క్లస్టర్ ఇన్‌చార్జ్‌లతో వివిధ అంశాలపై చర్చించి వారి అభిప్రాయాలను తెలుసుకున్నారు. అనంతరం ఆయా అంశాలను ఆన్‌లైన్ తీర్మానాల రూపంలో తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయానికి పంపించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు గుత్తుల సాయి, మాజీ శాసనసభ్యులు చెల్లి వివేకానంద , నియోజకవర్గ పరిశీలకురాలు సుంకర పావని,సీనియర్ నాయకులు తాడి నరసింహారావు,టేకుమూడి లక్ష్మణరావు,సాకా సీతాదేవి,సాగిరాజు సూరిబాబు రాజు,నడింపల్లి సుబ్బరాజు,ఇసుకపట్ల వెంకటేశ్వరరావు, ఇతర ముఖ్య నాయకులు, మండల పార్టీ అధ్యక్షులు, క్లస్టర్ ఇన్‌చార్జ్‌లు మరియు పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.

డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం పరిధిలోని ఐ పోలవరం మండలం మురమళ్ళ గ్రామంలో ఎమ్మెల్యే కార్యాలయంలో బుధవారం
తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యాలయం ఆదేశాల మేరకు నియోజకవర్గ స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి శాసనసభ విప్ మరియు ముమ్మిడివరం శాసనసభ్యులు దాట్ల సుబ్బరాజు హాజరై పార్టీ నాయకులు, కార్యకర్తలకు పలు సూచనలు చేసి దిశా నిర్దేశం చేశారు. ఈ నెల 27వ తేదీ నుంచి రాష్ట్ర ప్రభుత్వ రెండేళ్ల పాలన, సంక్షేమ పథకాలు మరియు అభివృద్ధి కార్యక్రమాలపై నిర్వహించనున్న ఇంటింటా సర్వే కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ప్రజలకు ప్రభుత్వ విజయాలను, అమలు చేస్తున్న సంక్షేమ పథకాల ఫలాలను సమర్థవంతంగా వివరించాలని సూచించారు.
ఈ సందర్భంగా మండల పార్టీ అధ్యక్షులు, క్లస్టర్ ఇన్‌చార్జ్‌లతో వివిధ అంశాలపై చర్చించి వారి అభిప్రాయాలను తెలుసుకున్నారు. అనంతరం ఆయా అంశాలను ఆన్‌లైన్ తీర్మానాల రూపంలో తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయానికి పంపించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు గుత్తుల సాయి, మాజీ శాసనసభ్యులు చెల్లి వివేకానంద , నియోజకవర్గ పరిశీలకురాలు సుంకర పావని,సీనియర్ నాయకులు తాడి నరసింహారావు,టేకుమూడి లక్ష్మణరావు,సాకా సీతాదేవి,సాగిరాజు సూరిబాబు రాజు,నడింపల్లి సుబ్బరాజు,ఇసుకపట్ల వెంకటేశ్వరరావు, ఇతర ముఖ్య నాయకులు, మండల పార్టీ అధ్యక్షులు, క్లస్టర్ ఇన్‌చార్జ్‌లు మరియు పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.