*రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగ, ఉపాధ్యాయుల పట్ల వ్యవహరిస్తున్న మొండివైఖరి విడనాడాలి.. రాష్ట్ర అధ్యక్షుడు శానమోని నర్సింలు డిమాండ్*
*పున్నమి ప్రతినిధి రంగారెడ్డి జిల్లా తేదీ 17/04/2026*
*రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక పెన్షనర్ల పట్ల వ్యవహరిస్తున్న మొండివైఖరి విడనాడి వెంటనే దీర్ఘకాలికంగా అపరిస్కృతంగా ఉన్న డిమాండ్లను పరిష్కరించాలని తెలియజేస్తూ ఈరోజు రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్లో కలెక్టర్ నారాయణ రెడ్డి గారికి వినతి పత్రాన్ని రికాగ్నైజ్ ఉపాధ్యాయ పండిత పరిషత్తు రాష్ట్ర అధ్యక్షులు ఆధ్వర్యంలో, రాష్ట్ర బాధ్యులు, రంగారెడ్డి జిల్లా రికగ్నైజ్డ్ ఉపాధ్యాయ పండిత పరిషత్తు జిల్లా బాధ్యులు వెంకటస్వామి, జిల్లా బాధ్యుల సమక్షంలో వినతి పత్రాన్ని అందించడం జరిగింది వారు ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్రంలో 30 నెలలుగా పిఆర్సి పెండింగ్లో ఉన్నదని ఉద్యోగ పెన్షనర్లకు మెరుగైన వైద్యం వైద్య చికిత్సల కోసం వైద్య సేవలు సూచించే హెల్త్ కార్డ్స్ వెంటనే మంజూరు చేయాలని రాష్ట్రంలో 50వేల మంది టెట్ మినహాయింపు లేదా టెట్ పరీక్ష విధానంలో మార్పులు అర్హత మార్కులు తగ్గించడం వంటి విషయాలను శాస్త్రీయంగా ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు, ఇంకా ఈ కార్యక్రమంలో టిటిజెఏసి పక్షాన అన్ని ఉపాధ్యాయ సంఘాల బాధ్యులు పాల్గొన్నారు*


