శుక్రవారం క్వారీ మార్కెట్ సెంటర్ లో బిజెపి జిల్లా కార్యాలయంలో తూర్పుగోదావరి జిల్లా ప్రధమ జిల్లా కార్యవర్గ సమావేశం జిల్లా అధ్యక్షులు పిక్కి నాగేంద్ర అధ్యక్షతన జరిగింది.
పార్టీ ఇటీవల తలపెట్టిన మండల ప్రశిక్షణ కార్యక్రమం, ప్రతి ఊరిలో బిజెపి జండా స్థూప నిర్మాణం వంటి కార్యక్రమాలపై సమాలోచన రాబోయే కాలంలో మహిళా రిజర్వేషన్ బిల్లుపై జిల్లావ్యాప్తంగా కార్యక్రమాలు, SIR లో పార్టీ బూత్ లెవెల్ కార్యకర్తలు చేయాల్సిన పనులు పై దిశా నిర్దేశం చేయడం జరిగింది. ఎమ్మెల్సీ సోము వీర్రాజు మాట్లాడుతూ కూటమి ధర్మాన్ని పాటిస్తూ క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేసే విధంగా నడుచుకోవాలని కార్యకర్తలకు దిశా నిర్దేశం చేయడం జరిగింది. SIR రాష్ట్ర కన్వీనర్ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ పోలింగ్ బూత్ స్థాయిలో కార్యకర్తలు ఎస్ఐఆర్ ప్రక్రియ లో పాల్గొని పూర్తి అప్రమత్తతతో ఈ ప్రక్రియ పూర్తయ్యే విధంగా క్షేత్రస్థాయిలో పనిచేయాలని కోరారు. ఈ సందర్భంగా SIR ప్రక్రియకు నియోజకవర్గాల వారీగా పార్టీ ఏజెంట్లుగా నియమించిన వారికి నియామక పత్రాలను అందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో పార్టీ జోనల్ ఇంచార్జ్ లక్ష్మీ ప్రసన్న, రాష్ట్ర కార్యదర్శి బొమ్మల దత్తు,జిల్లా జనరల్ సెక్రటరీలు, ఎమ్మెస్ కే రాజు, మద్దిపాటి స్వర్ణ రజని, శెట్టిపల్లి శివ నాగరాజు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు అడబాల రామకృష్ణ , ఉన్ని కృష్ణ , జిల్లా మహిళా మోర్చా అధ్యక్షురాలు పాలు అడుగుల శ్రీవిద్య, ఎస్సీ మోర్చా అధ్యక్షులు తగరం సురేష్ బాబు, మీడియా సెల్ కన్వీనర్ వీరా వీరాంజనేయులు, రవిశంకర్, ఆశిష్, కురగంటి సతీష్, ఆకుల శ్రీధర్, సూర్య కిరణ్, మోహిని, తూర్పుగోదావరి జిల్లాకు సంబంధించిన, బిజెపి మండల అధ్యక్ష & ప్రధాన కార్యదర్శులు, బిజెపి జిల్లా కార్యవర్గ సభ్యులు, బిజెపి జిల్లా పదాధికారులు, జిల్లా కోర్ కమిటీ సభ్యులు, వివిధ అసెంబ్లీల BLA1 లు, పెద్ద ఎత్తున కార్యకర్తలు పాల్గొన్నారు,


