Wednesday, 10 June 2026
  • Home  
  • రహదారుల నిర్మాణంలో భాగంగా భూసేకరణ త్వరగా చేయాలన్న : సీఎం
- తెలంగాణ

రహదారుల నిర్మాణంలో భాగంగా భూసేకరణ త్వరగా చేయాలన్న : సీఎం

నకిరేకల్ :సెప్టెంబర్ (పున్నమి ప్రతినిధి ) జాతీయ రహదారుల నిర్మాణంలో భాగంగా మిగిలిపోయిన భూసేకరణ ప్రక్రియను ఈ నెలాఖరులోగా పూర్తి చేయాలని రాష్ట్ర ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డి జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. సోమవారం ఆయన సచివాలయం నుండి జాతీయ రహదారణ నిర్మాణం,విస్తరణ పనులకు అవసరమైన భూసేకరణ పై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావుతో కలిసి అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. దసరా పండుగకు ముందే అన్ని జాతీయ రహదారుల భూ సేకరణ పనులు పూర్తి కావాలని చెప్పారు. కోర్టు కేసులు ఉన్న భూములకు సంబంధించి పూర్తి వివరాలను వెంటనే ప్రభుత్వానికి పంపాలని ఆదేశించారు. రహదారి నిర్మాణ పనులలో జాప్యం జరగకుండా ప్రతి కేసును అత్యంత ప్రాధాన్యంగా పరిగణించాలని, భూసేకరణలో ఎలాంటి ఆలస్యం జరగకూడదని ముఖ్యమంత్రి అన్నారు. టైటిల్ సమస్యలు ఉన్న భూముల విషయంలో పరిహారం మొత్తాన్ని డిపాజిట్ చేసి, భూములను సేకరించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.

నకిరేకల్ :సెప్టెంబర్ (పున్నమి ప్రతినిధి )
జాతీయ రహదారుల నిర్మాణంలో భాగంగా మిగిలిపోయిన భూసేకరణ ప్రక్రియను ఈ నెలాఖరులోగా పూర్తి చేయాలని రాష్ట్ర ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డి జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. సోమవారం ఆయన సచివాలయం నుండి జాతీయ రహదారణ నిర్మాణం,విస్తరణ పనులకు అవసరమైన భూసేకరణ పై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావుతో కలిసి అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
దసరా పండుగకు ముందే అన్ని జాతీయ రహదారుల భూ సేకరణ పనులు పూర్తి కావాలని చెప్పారు. కోర్టు కేసులు ఉన్న భూములకు సంబంధించి పూర్తి వివరాలను వెంటనే ప్రభుత్వానికి పంపాలని ఆదేశించారు.
రహదారి నిర్మాణ పనులలో జాప్యం జరగకుండా ప్రతి కేసును అత్యంత ప్రాధాన్యంగా పరిగణించాలని, భూసేకరణలో ఎలాంటి ఆలస్యం జరగకూడదని ముఖ్యమంత్రి అన్నారు. టైటిల్ సమస్యలు ఉన్న భూముల విషయంలో పరిహారం మొత్తాన్ని డిపాజిట్ చేసి, భూములను సేకరించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.