ప్రజల సౌకర్యార్థం ప్రభుత్వం నిర్మించిన రహదారులను ఉద్దేశపూర్వకంగా లేదా నిర్లక్ష్యంగా దెబ్బతీయడం చట్టరీత్యా నేరం.
జులై 21 ఖమ్మం జిల్లా పున్నమి ప్రతినిధి గుగులోత్ భావుసింగ్ నాయక్
ఏన్కూర్ మండలం:
టి.ఎల్.పేట గ్రామ ప్రధాన రహదారిపై ట్రాక్టర్‌కు ఫుల్ వీల్స్ (ఇనుప చక్రాలు) అమర్చి నడపడం వల్ల రోడ్డు తీవ్రంగా దెబ్బతిన్నట్లు గుర్తించబడింది. ఈ ఘటనకు సంబంధించి టి.ఎల్.పేట గ్రామానికి చెందిన కూచిపూడి నరసింహారావు, తండ్రి: అచ్చయ్య పై ప్రభుత్వ ఆస్తికి నష్టం కలిగించినందుకు సంబంధిత చట్టాల ప్రకారం ఏన్కూర్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేయడం జరిగింది.
ట్రాక్టర్లకు లేదా ఇతర వాహనాలకు ఫుల్ వీల్స్/ఇనుప చక్రాలు అమర్చి సీసీ రోడ్లపై నడపడం వల్ల రహదారులు తీవ్రంగా దెబ్బతింటాయి. దీని కారణంగా ప్రజా ధనం వృథా కావడంతో పాటు రహదారులపై ప్రయాణించే వాహనదారులు, ప్రజలకు ప్రమాదం ఏర్పడే అవకాశం ఉంది.
అందువల్ల ఎవరైనా ట్రాక్టర్లు లేదా ఇతర వాహనాలకు ఫుల్ వీల్స్ అమర్చి రహదారులపై నడిపి ప్రభుత్వ ఆస్తికి నష్టం కలిగించినట్లయితే, వారి మీద చట్టపరమైన చర్యలు తీసుకొని కేసులు నమోదు చేయబడతాయి.



