Sunday, 6 September 2026
  • Home  
  • రైతన్నకు సకాలంలో యూరియా.. ఏటికొప్పాకలో పంపిణీ కార్యక్రమం.
- అనకాపల్లి

రైతన్నకు సకాలంలో యూరియా.. ఏటికొప్పాకలో పంపిణీ కార్యక్రమం.

అనకాపల్లి జిల్లా, జూలై 21 (పున్నమి న్యూస్ రిపోర్టర్ ఆనంద్): ఎలమంచిలి మండలం ఏటికొప్పాక గ్రామ సచివాలయం పరిధిలో సోమవారం రైతులకు యూరియా పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఖరీఫ్ సీజన్‌లో పంటల సాగుకు అవసరమైన యూరియాను అర్హులైన రైతులకు సకాలంలో అందజేశారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రభుత్వం అవసరమైన ఎరువులను అందుబాటులో ఉంచిందని నాయకులు పేర్కొన్నారు. రైతులు యూరియాను సక్రమంగా వినియోగించి అధిక దిగుబడులు సాధించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో రైతు భరోసా కేంద్రం అధికారి కుమార్, కిసాన్ మోర్చా అధ్యక్షుడు శెన్నాంశెట్టి శ్రీను, జనసేన పార్టీ మండల అధ్యక్షుడు, మాజీ సర్పంచ్ అన్నం బాబ్జి, వైస్ ఎంపీపీ నాగిరెడ్డి అచ్చయ్య నాయుడు, మాజీ సర్పంచ్ కాంట్రకోట చిరంజీవి, రైతు సంఘం అధ్యక్షుడు నాగిరెడ్డి సత్యనారాయణ, దారా పోలిశెట్టి, దారా నూకరాజు, ఇందల సత్తిబాబు పాల్గొన్నారు. అలాగే గ్రామానికి చెందిన పలువురు రైతులు, ప్రజాప్రతినిధులు హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. రైతులు ప్రభుత్వం అందిస్తున్న వ్యవసాయ సేవలను సద్వినియోగం చేసుకుని పంటల దిగుబడిని పెంచుకోవాలని నాయకులు సూచించారు.

అనకాపల్లి జిల్లా, జూలై 21 (పున్నమి న్యూస్ రిపోర్టర్ ఆనంద్):
ఎలమంచిలి మండలం ఏటికొప్పాక గ్రామ సచివాలయం పరిధిలో సోమవారం రైతులకు యూరియా పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఖరీఫ్ సీజన్‌లో పంటల సాగుకు అవసరమైన యూరియాను అర్హులైన రైతులకు సకాలంలో అందజేశారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రభుత్వం అవసరమైన ఎరువులను అందుబాటులో ఉంచిందని నాయకులు పేర్కొన్నారు. రైతులు యూరియాను సక్రమంగా వినియోగించి అధిక దిగుబడులు సాధించాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో రైతు భరోసా కేంద్రం అధికారి కుమార్, కిసాన్ మోర్చా అధ్యక్షుడు శెన్నాంశెట్టి శ్రీను, జనసేన పార్టీ మండల అధ్యక్షుడు, మాజీ సర్పంచ్ అన్నం బాబ్జి, వైస్ ఎంపీపీ నాగిరెడ్డి అచ్చయ్య నాయుడు, మాజీ సర్పంచ్ కాంట్రకోట చిరంజీవి, రైతు సంఘం అధ్యక్షుడు నాగిరెడ్డి సత్యనారాయణ, దారా పోలిశెట్టి, దారా నూకరాజు, ఇందల సత్తిబాబు పాల్గొన్నారు. అలాగే గ్రామానికి చెందిన పలువురు రైతులు, ప్రజాప్రతినిధులు హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. రైతులు ప్రభుత్వం అందిస్తున్న వ్యవసాయ సేవలను సద్వినియోగం చేసుకుని పంటల దిగుబడిని పెంచుకోవాలని నాయకులు సూచించారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.