ఖమ్మం, జూన్
(పువ్వాడ నాగేంద్ర కుమార్ పున్నమి జిల్లా రిపోర్టర్):
భారత ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో కేంద్ర ప్రభుత్వం 12 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా శనివారం సాయంత్రం 5 గంటలకు ఖమ్మంలోని కావేరి హోటల్లో నిర్వహించనున్న మేధావుల సదస్సును విజయవంతం చేయాలని బీజేపీ ఖమ్మం జిల్లా అధ్యక్షుడు నెల్లూరు కోటేశ్వరరావు విజ్ఞప్తి చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మేధావులు, ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో హాజరై సదస్సును జయప్రదం చేయాలని కోరారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నిజామాబాద్ మాజీ ఎమ్మెల్యే ఎండల లక్ష్మీనారాయణ హాజరవుతున్నట్లు ఆయన తెలిపారు.



