జగ్గయ్యపేట నియోజకవర్గంలోని ముచ్చింతాల గ్రామానికి చెందిన బూసి రమేష్, వత్సవాయికి చెందిన మూడు హనుమ నాయక్, జగ్గయ్యపేటకు చెందిన తంగెళ్ల సత్యనారాయణ రాజు మృతిపై వైఎస్ఆర్సీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ తన్నీరు నాగేశ్వరరావు సంతాపం తెలిపారు. వారి పార్థివ దేహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించి, కుటుంబ సభ్యులను పరామర్శించారు. నాయకులు మార్కాపూడి గాంధీ, పటాన్ ఫిరోజ్ ఖాన్, గుత్తా శంకర్రావు, కన్నమాల శామ్యూల్, డేరంగుల శ్రీనివాసరావు, గంగిపోగు రమేష్, గోనెల శివ, బెల్లంకొండ శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.




