Saturday, 29 August 2026
  • Home  
  • మహిళా పారిశ్రామికవేత్తలకు ‘ర్యాంప్‌’తో కొత్త అవకాశాలు వ్యాపార విస్తరణకు ప్రభుత్వ ప్రోత్సాహకాలను సద్వినియోగం చేసుకోవాలి: డీఆర్‌డీవో విజయలక్ష్మి
- నిర్మల్

మహిళా పారిశ్రామికవేత్తలకు ‘ర్యాంప్‌’తో కొత్త అవకాశాలు వ్యాపార విస్తరణకు ప్రభుత్వ ప్రోత్సాహకాలను సద్వినియోగం చేసుకోవాలి: డీఆర్‌డీవో విజయలక్ష్మి

నిర్మల్ జిల్లా ఆగష్టు 29 (పున్నమి ప్రతినిధి) నిర్మల్ : మహిళలు పారిశ్రామిక రంగంలో రాణించి ఆర్థికంగా స్వావలంబన సాధించేందుకు ప్రభుత్వం అందిస్తున్న పథకాలు, ప్రోత్సాహకాలను సద్వినియోగం చేసుకోవాలని డీఆర్‌డీవో విజయలక్ష్మి సూచించారు. మహిళా పారిశ్రామికవేత్తలు తమ వ్యాపారాలను మరింత విస్తరించుకునేందుకు ‘ర్యాంప్‌–ఉమెన్‌ యాక్సిలరేషన్‌ ప్రోగ్రాం’ మంచి అవకాశమని ఆమె పేర్కొన్నారు. తెలంగాణ ప్రభుత్వ ఐటీ, ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ కమ్యూనికేషన్స్‌ శాఖ ఆధ్వర్యంలోని వి-హబ్‌ సౌజన్యంతో నిర్మల్‌ కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో శనివారం స్వయం సహాయక సంఘాల మహిళలు, మహిళా పారిశ్రామికవేత్తలకు ‘ర్యాంప్‌–ఉమెన్‌ యాక్సిలరేషన్‌ ప్రోగ్రాం’పై అవగాహన సదస్సు నిర్వహించారు. ప్రపంచ బ్యాంకు, కేంద్ర సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల మంత్రిత్వ శాఖ సంయుక్త సహకారంతో ‘ర్యాంప్‌’ కార్యక్రమాన్ని అమలు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. మహిళల ఆధ్వర్యంలో నడుస్తున్న సూక్ష్మ, చిన్న తరహా వ్యాపార సంస్థలను వేగంగా అభివృద్ధి చేయడం, వాటి సామర్థ్యాన్ని పెంచడం కార్యక్రమం ప్రధాన ఉద్దేశమన్నారు. ఎంపికైన మహిళా పారిశ్రామికవేత్తలకు రెండేళ్లపాటు ప్రత్యేక శిక్షణ, మార్గదర్శకత్వం, మెంటరింగ్‌, అవసరమైన సహకారం అందిస్తారని వివరించారు. జౌళి, ఆహార శుద్ధి, తయారీ, చేతివృత్తులు, హస్తకళలు తదితర రంగాల్లోని వ్యాపారాలకు ప్రోత్సాహం లభిస్తుందని తెలిపారు. వ్యాపార నిర్వహణ నైపుణ్యాలు, ఉత్పత్తుల నాణ్యత, కొత్త ఉత్పత్తుల రూపకల్పన, ఉత్పత్తుల వైవిధ్యీకరణ, బ్రాండింగ్‌, మార్కెటింగ్‌ తదితర అంశాల్లో సహకారం అందిస్తారన్నారు. అలాగే బ్యాంకుల ద్వారా రుణ అనుసంధానం కల్పించడంతో పాటు వివిధ రంగాలకు చెందిన నిపుణులతో వ్యక్తిగత మెంటరింగ్‌ అందించి వ్యాపారాలను మరింత లాభదాయకంగా తీర్చిదిద్దేందుకు తోడ్పడతారని అధికారులు తెలిపారు. సదస్సులో ‘ర్యాంప్‌–ఉమెన్‌ యాక్సిలరేషన్‌ ప్రోగ్రాం’ అర్హతలు, ఎంపిక విధానం, శిక్షణ, ప్రయోజనాలు, వ్యాపార విస్తరణకు అందించే సహకారంపై మహిళలకు అవగాహన కల్పించారు. కార్యక్రమం ద్వారా తమ వ్యాపారాలను విస్తరించేందుకు ఆసక్తి చూపిన పలువురు మహిళా ఔత్సాహిక పారిశ్రామికవేత్తల నుంచి దరఖాస్తులు స్వీకరించారు. కార్యక్రమంలో డీపీఎం మారుతి, వి-హబ్‌ డైరెక్టర్‌ జాహిద్‌ షేక్‌, అసోసియేట్‌ డైరెక్టర్‌ ఊహ, ప్రతినిధులు డాక్టర్‌ డెబోశ్రీ, రూపానంద్‌, హరిచందనతో పాటు స్వయం సహాయక సంఘాల మహిళలు, మహిళా పారిశ్రామికవేత్తలు పాల్గొన్నారు.

నిర్మల్ జిల్లా ఆగష్టు 29 (పున్నమి ప్రతినిధి)
నిర్మల్ : మహిళలు పారిశ్రామిక రంగంలో రాణించి ఆర్థికంగా స్వావలంబన సాధించేందుకు ప్రభుత్వం అందిస్తున్న పథకాలు, ప్రోత్సాహకాలను సద్వినియోగం చేసుకోవాలని డీఆర్‌డీవో విజయలక్ష్మి సూచించారు. మహిళా పారిశ్రామికవేత్తలు తమ వ్యాపారాలను మరింత విస్తరించుకునేందుకు ‘ర్యాంప్‌–ఉమెన్‌ యాక్సిలరేషన్‌ ప్రోగ్రాం’ మంచి అవకాశమని ఆమె పేర్కొన్నారు.
తెలంగాణ ప్రభుత్వ ఐటీ, ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ కమ్యూనికేషన్స్‌ శాఖ ఆధ్వర్యంలోని వి-హబ్‌ సౌజన్యంతో నిర్మల్‌ కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో శనివారం స్వయం సహాయక సంఘాల మహిళలు, మహిళా పారిశ్రామికవేత్తలకు ‘ర్యాంప్‌–ఉమెన్‌ యాక్సిలరేషన్‌ ప్రోగ్రాం’పై అవగాహన సదస్సు నిర్వహించారు.
ప్రపంచ బ్యాంకు, కేంద్ర సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల మంత్రిత్వ శాఖ సంయుక్త సహకారంతో ‘ర్యాంప్‌’ కార్యక్రమాన్ని అమలు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. మహిళల ఆధ్వర్యంలో నడుస్తున్న సూక్ష్మ, చిన్న తరహా వ్యాపార సంస్థలను వేగంగా అభివృద్ధి చేయడం, వాటి సామర్థ్యాన్ని పెంచడం కార్యక్రమం ప్రధాన ఉద్దేశమన్నారు.
ఎంపికైన మహిళా పారిశ్రామికవేత్తలకు రెండేళ్లపాటు ప్రత్యేక శిక్షణ, మార్గదర్శకత్వం, మెంటరింగ్‌, అవసరమైన సహకారం అందిస్తారని వివరించారు. జౌళి, ఆహార శుద్ధి, తయారీ, చేతివృత్తులు, హస్తకళలు తదితర రంగాల్లోని వ్యాపారాలకు ప్రోత్సాహం లభిస్తుందని తెలిపారు. వ్యాపార నిర్వహణ నైపుణ్యాలు, ఉత్పత్తుల నాణ్యత, కొత్త ఉత్పత్తుల రూపకల్పన, ఉత్పత్తుల వైవిధ్యీకరణ, బ్రాండింగ్‌, మార్కెటింగ్‌ తదితర అంశాల్లో సహకారం అందిస్తారన్నారు. అలాగే బ్యాంకుల ద్వారా రుణ అనుసంధానం కల్పించడంతో పాటు వివిధ రంగాలకు చెందిన నిపుణులతో వ్యక్తిగత మెంటరింగ్‌ అందించి వ్యాపారాలను మరింత లాభదాయకంగా తీర్చిదిద్దేందుకు తోడ్పడతారని అధికారులు తెలిపారు.
సదస్సులో ‘ర్యాంప్‌–ఉమెన్‌ యాక్సిలరేషన్‌ ప్రోగ్రాం’ అర్హతలు, ఎంపిక విధానం, శిక్షణ, ప్రయోజనాలు, వ్యాపార విస్తరణకు అందించే సహకారంపై మహిళలకు అవగాహన కల్పించారు. కార్యక్రమం ద్వారా తమ వ్యాపారాలను విస్తరించేందుకు ఆసక్తి చూపిన పలువురు మహిళా ఔత్సాహిక పారిశ్రామికవేత్తల నుంచి దరఖాస్తులు స్వీకరించారు. కార్యక్రమంలో డీపీఎం మారుతి, వి-హబ్‌ డైరెక్టర్‌ జాహిద్‌ షేక్‌, అసోసియేట్‌ డైరెక్టర్‌ ఊహ, ప్రతినిధులు డాక్టర్‌ డెబోశ్రీ, రూపానంద్‌, హరిచందనతో పాటు స్వయం సహాయక సంఘాల మహిళలు, మహిళా పారిశ్రామికవేత్తలు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.