నెల్లూరు జిల్లా మనుబోలు మండల కేంద్రంలోని చంద్రమౌళి నగర్ ప్రాథమిక పాఠశాలలో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. విద్యా కమిటీ చైర్మన్ టి. స్వాతి జాతీయ జెండాను ఆవిష్కరించారు. విద్యార్థులకు వ్యాసరచన, ఆటల పోటీలు నిర్వహించి విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు. బాలాజీ స్టీల్ అండ్ సిమెంట్ అధినేత బి. మోహన్ సహకారంతో పిల్లలకు స్వీట్లు, బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో హెచ్ఎం రాణి, ఉపాధ్యాయులు అనంతయ్య తదితరులు పాల్గొన్నారు.

మనుబోలులో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు