జయశంకర్ జిల్లా ఆగస్ట్ 15: ప్రజా సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని *ప్రభుత్వ విప్ యెన్నం శ్రీనివాస్ రెడ్డి* తెలిపారు. శనివారం ఐడిఓసి కార్యాలయంలో నూతన డిజిటలైజ్డ్ ప్లాస్టిక్ స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన *ప్రభుత్వ విప్ యెన్నం శ్రీనివాస్ రెడ్డి, భూపాలపల్లి శాసన సభ్యులు గండ్ర సత్యనారాయణ రావు, జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మతో* కలిసి స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీని ప్రారంభించారు._
_ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ మాట్లాడుతూ రాష్ట్రంలో కోటికి పైగా డిజిటలైజ్డ్, భద్రతా ప్రమాణాలతో కూడిన ప్లాస్టిక్ స్మార్ట్ రేషన్ కార్డులను ప్రజలకు అందిస్తున్నట్లు తెలిపారు.అర్హులైన ప్రతి కుటుంబానికి ప్రభుత్వ సంక్షేమ పథకాల ప్రయోజనాలను పారదర్శకంగా అందించడమే ప్రజా ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు. స్మార్ట్ రేషన్ కార్డుల రూపకల్పన, పంపిణీకి చర్యలు తీసుకున్న *ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి* ఆయన ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 48 గంటల్లోనే మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని కల్పించిందని ప్రభుత్వ విప్ తెలిపారు. దీని ద్వారా మహిళలు, విద్యార్థినులు విద్య, ఉద్యోగాలు, స్వయం ఉపాధి అవకాశాల కోసం స్వేచ్ఛగా ప్రయాణిస్తూ ఆర్థికంగా, సామాజికంగా సాధికారత సాధిస్తున్నారని పేర్కొన్నారు. ప్రజాపంపిణీ వ్యవస్థ ద్వారా పేదలకు నాణ్యమైన సన్న బియ్యం అందిస్తున్నామని తెలిపారు. పాఠశాలలు, హాస్టళ్లలో విద్యార్థులకు సన్న బియ్యంతో పాటు నాణ్యమైన అల్పాహారం, మధ్యాహ్న భోజనం అందిస్తున్నట్లు పేర్కొన్నారు.విద్యారంగాన్ని బలోపేతం చేసేందుకు 11 వేల మంది ఉపాధ్యాయుల నియామకం చేపట్టినట్లు తెలిపారు. నవంబర్ నుండి రేషన్ కార్డు కలిగిన కుటుంబాలకు 5 లక్షల ప్రమాద బీమా అమలు చేయనున్నట్లు వివరించారు._
_*భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు మాట్లాడుతూ,…* డూప్లికేట్ చేయడానికి వీలు లేని విధంగా 9 రకాల అత్యాధునిక భద్రతా ఫీచర్లతో నూతన డిజిటల్ స్మార్ట్ రేషన్ కార్డులను ప్రభుత్వం పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. స్మార్ట్ రేషన్ కార్డు కేవలం రేషన్ బియ్యం పొందేందుకు మాత్రమే కాకుండా, రాష్ట్రంలో ఎక్కడైనా రేషన్ పొందేందుకు పోర్టబిలిటీ సౌకర్యంతో పాటు కళ్యాణలక్ష్మి, సీఎంఆర్ఎఫ్, ఆరోగ్యశ్రీ, స్కాలర్షిప్లు తదితర ప్రభుత్వ సేవలు, పథకాలలో గుర్తింపు కార్డుగా ఉపయోగపడే విధంగా రూపొందించినట్లు తెలిపారు. గత పదేళ్లుగా పాత రేషన్ కార్డుల్లో కుటుంబ సభ్యుల పేర్లు చేర్చక ఇబ్బందులు ఎదుర్కొన్న ప్రజల సమస్యను పరిష్కరించినట్లు ఎమ్మెల్యే తెలిపారు. భూపాలపల్లి నియోజకవర్గంలో 14,955 మంది, మంథని నియోజకవర్గ పరిధిలోని ఐదు మండలాల్లో 7,197 మంది మొత్తంగా 22,152 మంది కుటుంబ సభ్యుల పేర్లను పాత రేషన్ కార్డుల్లో చేర్చినట్లు వెల్లడించారు.49,874 మంది లబ్ధిదారులకు కొత్త స్మార్ట్ రేషన్ కార్డులు కొత్తగా ఏర్పడిన కుటుంబాలకు సంబంధించి భూపాలపల్లి నియోజకవర్గంలో 11,836 మంది, మంథని నియోజకవర్గ పరిధిలో 5,485 మంది, హన్మకొండ జిల్లా పరిధిలోని శాయంపేట మండలంలో 17,301 మంది కలిపి మొత్తం 49,874 మంది లబ్ధిదారులకు కొత్త స్మార్ట్ రేషన్ కార్డులు అందిస్తున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు. ప్రతి వ్యక్తికి నెలకు 6 కిలోల చొప్పున, కార్డులోని సభ్యుల సంఖ్యను బట్టి గరిష్టంగా 36 కిలోల వరకు నాణ్యమైన సన్న బియ్యాన్ని ప్రభుత్వం అందిస్తున్నట్లు తెలిపారు.ఇందుకోసం ప్రభుత్వంపై ఏటా భారీ ఆర్థిక భారం పడుతున్నప్పటికీ పేదల సంక్షేమానికే ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని పేర్కొన్నారు. సన్న రకం వడ్లు పండించే రైతులకు క్వింటాలుకు రూ.500 బోనస్ అందిస్తున్నట్లు తెలిపారు.రైతు బీమా కింద అర్హులైన రైతు కుటుంబాలకు రూ.5 లక్షల పరిహారం, మహిళలు, వితంతువులు, గీత కార్మికులు, చేనేత కార్మికులు, ఒంటరి మహిళలకు సామాజిక భద్రత పింఛన్లు, మహిళలకు ఉచిత ఆర్టీసీ ప్రయాణం, ఆరోగ్యశ్రీ పరిమితి పెంపు, ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం వంటి సంక్షేమ కార్యక్రమాలను ప్రభుత్వం అమలు చేస్తోందని ఎమ్మెల్యే వివరించారు._

