ఖమ్మం: గంజాయి అక్రమ రవాణా కేసులో నలుగురు నిందితులకు 10 ఏళ్ల జైలు శిక్షతో పాటు ఒక్కొక్కరికి రూ.లక్ష చొప్పున జరిమానా విధిస్తూ ఇన్చార్జి అదనపు జిల్లా కోర్టు న్యాయమూర్తి పీవీ కృష్ణార్జున బుధవారం తీర్పు వెలువరించారు. 2022లో ఖమ్మం రైల్వే స్టేషన్ ప్లాట్‌ఫాం నంబర్-2పై మధ్యప్రదేశ్‌కు చెందిన రాజేష్ కిరార్, రాజ్‌పుత్ రాజ్‌కుమార్, హరి ఓం, పూనమ్ దేవి 101 కిలోల గంజాయిని అక్రమంగా రవాణా చేస్తూ పోలీసులకు పట్టుబడ్డారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు అనంతరం కోర్టులో ఛార్జిషీట్ దాఖలు చేశారు. విచారణలో నేరం రుజువు కావడంతో న్యాయస్థానం నలుగురికి జైలు శిక్ష, జరిమానా విధిస్తూ తీర్పు ఇచ్చింది.



