నెల్లూరు నగరంలోని దశాబ్దాల చరిత్ర కలిగిన మంచినీటి చెరువులోకి డ్రైనేజీ నీరు యథేచ్ఛగా చేరుతుండటంపై స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చెరువులో డ్రైనేజీ నీరు కలవడంతో నీరు కలుషితమవుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదని ప్రజలు ఆరోపిస్తున్నారు. ప్రతిరోజూ వందలాది మంది ఉదయం, సాయంత్రం చెరువు గట్టు వెంట వాకింగ్ చేస్తుంటారు. పలువురు అధికారులు, రాజకీయ నాయకులు సైతం వివిధ కార్యక్రమాల కోసం ఈ ప్రాంతానికి వస్తున్నప్పటికీ సమస్యను గుర్తించకపోవడం విచారకరమని స్థానికులు అంటున్నారు. నెల్లూరు ప్రజల దాహార్తిని తీర్చే మంచినీటి వనరులోకి మురుగునీరు చేరడం సిగ్గుచేటని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి డ్రైనేజీ నీటి ప్రవాహాన్ని మళ్లించి, చెరువు నీటిని సంరక్షించాలని ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు.

మంచినీటి చెరువులో డ్రైనేజీ కలకలం.. అధికారుల నిర్లక్ష్యంపై ప్రజల ఆగ్రహం