Thursday, 10 September 2026
  • Home  
  • మంగనూర్ లో వేడుకగా కేటీఆర్ జన్మదిన వేడుకలు
- నాగర్‌కర్నూల్

మంగనూర్ లో వేడుకగా కేటీఆర్ జన్మదిన వేడుకలు

బిజినేపల్లి: మండల పరిధిలోని మంగనూర్ గ్రామంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జన్మదిన వేడుకలను నాయకులు, కార్యకర్తలు ఉత్సాహంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామంలో కేక్ కట్ చేసి, ఒకరికొకరు తినిపించుకుంటూ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. కేటీఆర్ ఆయురారోగ్యాలతో, నిండు నూరేళ్లు సంతోషంగా జీవించాలని వారు ఆకాంక్షించారు. పార్టీ బలోపేతానికి, తెలంగాణ అభివృద్ధికి కేటీఆర్ అందిస్తున్న సేవలను కొనియాడారు. అనంతరం ప్రజలకు మిఠాయిలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు, సీనియర్ నాయకులు, యువజన విభాగానికి చెందిన కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు. Uploaded Video:

బిజినేపల్లి: మండల పరిధిలోని మంగనూర్ గ్రామంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జన్మదిన వేడుకలను నాయకులు, కార్యకర్తలు ఉత్సాహంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామంలో కేక్ కట్ చేసి, ఒకరికొకరు తినిపించుకుంటూ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. కేటీఆర్ ఆయురారోగ్యాలతో, నిండు నూరేళ్లు సంతోషంగా జీవించాలని వారు ఆకాంక్షించారు. పార్టీ బలోపేతానికి, తెలంగాణ అభివృద్ధికి కేటీఆర్ అందిస్తున్న సేవలను కొనియాడారు. అనంతరం ప్రజలకు మిఠాయిలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు, సీనియర్ నాయకులు, యువజన విభాగానికి చెందిన కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు.

Uploaded Video:

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.