Sunday, 26 July 2026
  • Home  
  • ధర్మరాజుల స్వామి బ్రహ్మోత్సవాల అర్జున తపస్సుమాన్ వేడుకలో ఎమ్మెల్యే
- తిరుపతి

ధర్మరాజుల స్వామి బ్రహ్మోత్సవాల అర్జున తపస్సుమాన్ వేడుకలో ఎమ్మెల్యే

శ్రీ కాళహస్తి, జులై 24, (పున్నమి న్యూస్): శ్రీకాళహస్తిలోని శ్రీ శ్రీ శ్రీ ద్రౌపతీ సమేత శ్రీ ధర్మరాజుల స్వామి వారి బ్రహ్మోత్సవాల సందర్భంగా శుక్రవారం నిర్వహించిన పవిత్రమైన ‘అర్జున తపస్సు’ కార్యక్రమం అత్యంత వైభవంగా జరిగింది. ఈ ఆధ్యాత్మిక వేడుకకు శ్రీకాళహస్తి నియోజకవర్గ శాసనసభ్యులు బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై స్వామి, అమ్మవార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆయన భక్తులతో కలిసి కూర్చుని ఎంతో ఉత్కంఠభరితంగా సాగిన అర్జున తపస్సు ఘట్టాన్ని తిలకించి ఆధ్యాత్మిక ఆనందాన్ని పంచుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. నియోజకవర్గ ప్రజలందరూ సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని ఆ దైవస్వరూపులను వేడుకున్నట్లు తెలిపారు. బ్రహ్మోత్సవాలు విజయవంతంగా కొనసాగుతున్నాయని, భక్తులు మరింత అధిక సంఖ్యలో తరలివచ్చి శ్రీ ద్రౌపతీ అమ్మవారి, శ్రీ ధర్మరాజుల స్వామి వారి కృపాకటాక్షాలు పొందాలని ఆయన ఆకాంక్షించారు. ఈ మహోత్సవంలో ఆలయ కమిటీ సభ్యులు, స్థానిక ప్రజాప్రతినిధులు, వివిధ పార్టీల నాయకులు, ప్రభుత్వ అధికారులు మరియు వేలాది మంది భక్తులు పాల్గొని స్వామివార్లను దర్శించుకున్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.