దేశంలో వేగంగా విస్తరిస్తున్న సౌర, పవన విద్యుత్ ప్రాజెక్టుల ప్రభావంపై మరింత లోతైన అధ్యయనాలు అవసరమని వాతావరణ శాస్త్రవేత్తలు అభిప్రాయపడ్డారు. పెద్ద ఎత్తున ఏర్పాటవుతున్న పునరుత్పాదక ఇంధన ప్రాజెక్టులు స్థానిక వాతావరణ పరిస్థితులపై ఎలాంటి ప్రభావం చూపుతున్నాయనే అంశంపై పరిమిత సమాచారం మాత్రమే అందుబాటులో ఉందని తెలిపారు. ఈ ప్రాజెక్టుల వల్ల ఉష్ణోగ్రతలు, గాలి ప్రవాహాలు, భూభాగ వినియోగంలో వచ్చే మార్పులను శాస్త్రీయంగా అధ్యయనం చేయాల్సిన అవసరం ఉందని సూచించారు. భవిష్యత్‌లో పర్యావరణానికి అనుకూల విధానాల రూపకల్పనకు ఈ పరిశోధనలు ఉపయోగపడతాయని పేర్కొన్నారు.

భారీ సౌర, పవన ప్రాజెక్టుల ప్రభావంపై దీర్ఘకాలిక అధ్యయనాల అవసరం