భారత్‌లో వాతావరణ పరిశోధనలకు అవసరమైన శాస్త్రీయ పరికరాల తయారీ సామర్థ్యం గణనీయంగా తగ్గిపోవడంపై ప్రముఖ శాస్త్రవేత్తలు ఆందోళన వ్యక్తం చేశారు. ప్రస్తుతం అనేక పరిశోధనా సంస్థలు దిగుమతి పరికరాలపై ఆధారపడుతున్నాయని, వాటిలో కొన్ని సరైన కాలిబ్రేషన్ లేకుండా సంవత్సరాల పాటు వినియోగంలో ఉంటున్నాయని పేర్కొన్నారు. దీనివల్ల సేకరించే వాతావరణ డేటా ఖచ్చితత్వంపై ప్రభావం పడే ప్రమాదం ఉందని హెచ్చరించారు. 2035 వరకు దేశ వాతావరణ పరిశోధనకు మార్గదర్శకంగా రూపొందించిన ‘మెగా సైన్స్ విజన్’ నివేదికలో ఈ అంశాలను ప్రస్తావించారు. స్వదేశీ పరిశోధనా పరికరాల అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక ప్రోత్సాహం ఇవ్వాలని శాస్త్రవేత్తలు సూచించారు.

వాతావరణ పరిశోధనలో స్వదేశీ పరికరాల కొరతపై శాస్త్రవేత్తల ఆందోళన