ఖమ్మం: ఆగష్టు
(పున్నమి న్యూస్ )
60 ఏళ్లు దాటిన భవన నిర్మాణ కార్మికులకు నెలకు రూ.9 వేల పెన్షన్ మంజూరు చేయాలని టీయూసీఐ జిల్లా కార్యదర్శి పుల్లయ్య డిమాండ్ చేశారు. ఖమ్మంలోని రామనరసయ్య విజ్ఞాన కేంద్రంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ, గత పదేళ్లుగా ఏ ప్రభుత్వం కూడా భవన నిర్మాణ కార్మికుల సంక్షేమానికి కొత్త పథకాలను అమలు చేయలేదని విమర్శించారు. ప్రతి భవన నిర్మాణ కార్మికుడికి హెల్త్ కార్డు మంజూరు చేసి, సంక్షేమ పథకాలను సమర్థవంతంగా అమలు చేయాలని టీయూసీఐ నాయకుడు శ్రీనివాస్ ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు. సమావేశంలో కార్మికుల సమస్యలపై చర్చించి, వాటి పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని కోరారు.



