అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం, పున్నమి న్యూస్ ప్రతినిధి :
విద్యార్థుల భవిష్యత్తు బలోపేతమే లక్ష్యంగా అచ్యుతాపురంలోని బ్రాండిక్స్ సంస్థ ఆధ్వర్యంలో జూనియర్స్ స్కాలర్షిప్ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. సంస్థలో ఒక సంవత్సరం పూర్తి చేసిన ఉద్యోగుల పిల్లలకు సంస్థ ప్రతినిధి దొరైస్వామి చేతుల మీదుగా పాఠశాల బ్యాగులు, నోట్ పుస్తకాలు, పెన్సిళ్లు, పెన్నులు, జ్యామితి పెట్టెలు, రంగుల సామగ్రి తదితర విద్యా అవసరాలకు ఉపయోగపడే వస్తువులను పంపిణీ చేశారు.
ఉద్యోగుల కుటుంబాల సంక్షేమం, వారి పిల్లల విద్యాభివృద్ధికి ప్రాధాన్యతనిస్తూ బ్రాండిక్స్ సంస్థ ప్రతి సంవత్సరం జూనియర్స్ స్కాలర్షిప్ కార్యక్రమాన్ని నిర్వహించడం అభినందనీయమని పలువురు పేర్కొన్నారు. విద్యార్థుల్లో చదువుపై ఆసక్తి పెంపొందించడంతో పాటు వారి లక్ష్య సాధనకు ప్రోత్సాహం అందించడమే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశమని నిర్వాహకులు తెలిపారు.
ఈ సందర్భంగా దొరైస్వామి మాట్లాడుతూ, నేటి విద్యార్థులే రేపటి భారతదేశ నిర్మాణ కర్తలని, ఉన్నత విద్యను అభ్యసించి సమాజానికి ఆదర్శంగా నిలవాలని ఆకాంక్షించారు. ఉద్యోగుల శ్రేయస్సుతో పాటు వారి కుటుంబ సభ్యుల అభివృద్ధికి కూడా బ్రాండిక్స్ సంస్థ కట్టుబడి పనిచేస్తోందన్నారు.
ఈ కార్యక్రమంలో సంస్థ అధికారులు, ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. విద్యార్థులకు విద్యా సామగ్రి అందజేయడం పట్ల తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేస్తూ సంస్థ యాజమాన్యానికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

బ్రాండిక్స్ ఉద్యోగుల కుటుంబాలకు మరో వరం – దొరైస్వామి చేతుల మీదుగా విద్యా కిట్ల పంపిణీ….!
అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం, పున్నమి న్యూస్ ప్రతినిధి : విద్యార్థుల భవిష్యత్తు బలోపేతమే లక్ష్యంగా అచ్యుతాపురంలోని బ్రాండిక్స్ సంస్థ ఆధ్వర్యంలో జూనియర్స్ స్కాలర్షిప్ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. సంస్థలో ఒక సంవత్సరం పూర్తి చేసిన ఉద్యోగుల పిల్లలకు సంస్థ ప్రతినిధి దొరైస్వామి చేతుల మీదుగా పాఠశాల బ్యాగులు, నోట్ పుస్తకాలు, పెన్సిళ్లు, పెన్నులు, జ్యామితి పెట్టెలు, రంగుల సామగ్రి తదితర విద్యా అవసరాలకు ఉపయోగపడే వస్తువులను పంపిణీ చేశారు. ఉద్యోగుల కుటుంబాల సంక్షేమం, వారి పిల్లల విద్యాభివృద్ధికి ప్రాధాన్యతనిస్తూ బ్రాండిక్స్ సంస్థ ప్రతి సంవత్సరం జూనియర్స్ స్కాలర్షిప్ కార్యక్రమాన్ని నిర్వహించడం అభినందనీయమని పలువురు పేర్కొన్నారు. విద్యార్థుల్లో చదువుపై ఆసక్తి పెంపొందించడంతో పాటు వారి లక్ష్య సాధనకు ప్రోత్సాహం అందించడమే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశమని నిర్వాహకులు తెలిపారు. ఈ సందర్భంగా దొరైస్వామి మాట్లాడుతూ, నేటి విద్యార్థులే రేపటి భారతదేశ నిర్మాణ కర్తలని, ఉన్నత విద్యను అభ్యసించి సమాజానికి ఆదర్శంగా నిలవాలని ఆకాంక్షించారు. ఉద్యోగుల శ్రేయస్సుతో పాటు వారి కుటుంబ సభ్యుల అభివృద్ధికి కూడా బ్రాండిక్స్ సంస్థ కట్టుబడి పనిచేస్తోందన్నారు. ఈ కార్యక్రమంలో సంస్థ అధికారులు, ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. విద్యార్థులకు విద్యా సామగ్రి అందజేయడం పట్ల తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేస్తూ సంస్థ యాజమాన్యానికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

