Monday, 29 June 2026
  • Home  
  • బొజ్జల బృందమ్మ చేతుల మీదుగా ఊరందూరు జెడ్పీ పాఠశాలలో విద్యాసామగ్రి పంపిణీ
- తిరుపతి

బొజ్జల బృందమ్మ చేతుల మీదుగా ఊరందూరు జెడ్పీ పాఠశాలలో విద్యాసామగ్రి పంపిణీ

శ్రీ కాళహస్తి, జూన్ 29, (పున్నమి న్యూస్) : శ్రీకాళహస్తి మండలం ఊరందూరు గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల పదో తరగతి విద్యార్థులకు ఆధ్యాత్మిక అవధూత మాసపత్రిక ఆధ్వర్యంలో ‘జన చర్య’ పుస్తకం డైరీలు, విద్యాసామగ్రిని బొజ్జల బృందమ్మ చేతుల మీదుగా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, విద్యార్థుల జీవితంలో పదో తరగతి అత్యంత కీలకమైన దశ అని, ఇందులో ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణత సాధిస్తేనే ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని పేర్కొన్నారు. పాఠశాలలోని విద్యార్థులకు అవసరమైన క్రీడా సామగ్రిని సమకూర్చడంతో పాటు, పాఠశాల భవన మరమ్మత్తుల విషయాన్ని ఎమ్మెల్యే బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లి త్వరలోనే సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. విశ్రాంత ఉపాధ్యాయుడు ఆనంద్ రెడ్డి మాట్లాడుతూ, ఈ ఏడాది మొత్తం 1,200 మంది పదో తరగతి విద్యార్థులకు డైరీలు, విద్యాసామగ్రి కిట్లను అందిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు రాజకుమారి, ఉపాధ్యాయ సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.